IPL Playoff Teams : ఐపీఎల్ లో లీగ్ మ్యాచ్లు ఆల్మోస్ట్ ముగిసినట్టే. ఒకటి రెండు మినహా మిగతా అన్ని జట్లు దాదాపుగా పూర్తి మ్యాచ్లు ఆడేశాయి. ఇప్పటికే ప్లే ఆఫ్ వెళ్లిపోయిన జట్లపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చింది. పంజాబ్, ముంబై, గుజరాత్, బెంగళూరు ప్లే ఆఫ్ వెళ్లిపోయాయి.. అయితే ప్లే ఆఫ్ వెళ్లిన తర్వాత పంజాబ్, గుజరాత్, బెంగళూరు ఓటములు ఎదుర్కొన్నాయి. పంజాబ్ ఢిల్లీ చేతిలో, గుజరాత్ లక్నో చేతిలో, బెంగళూరు హైదరాబాద్ చేతిలో ఓటములు చవిచూశాయి. ఈ ఓటముల ద్వారా ఆ జట్ల టాప్ -2 అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.. ఐపీఎల్ నిబంధనల ప్రకారం టాప్ -2 జట్లకు కాస్త వెసలు బాటు ఉంటుంది. ఒక మ్యాచ్ లో మరో మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం గుజరాత్, పంజాబ్, బెంగళూరు ఓటములు ఎదుర్కొన్న నేపథ్యంలో.. వాటి టాప్ -2 అవకాశాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే..
Also Read : ఫిట్ గా లేకుంటే ఒక బాధ.. ఉంటే మరో బాధ! ఇదీ టీమిండియా సెలక్షన్ కమిటీ తీరు!
గిల్ సేన ఖాతాలో 18 పాయింట్లు ఉన్నాయి. ఆదివారం గుజరాత్ చెన్నై జట్టుతో తలపడుతుంది. చెన్నై చేతిలో ఓడిపోతే గుజరాత్ జట్టుకు ఇబ్బంది తప్పదు. అలా జరగకూడదు అనుకుంటే గుజరాత్ కచ్చితంగా గెలుపొందాలి. ఇక ఒకవేళ గుజరాత్ టాప్ -2 లో స్థానం సంపాదించాలంటే ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ తలపడే తదుపరి మ్యాచ్లలో ఓడిపోవాలి.
పంజాబ్ జట్టు ఖాతాలో ప్రస్తుతం 17 పాయింట్లు ఉన్నాయి. ఈ జట్టు తన చివరి మ్యాచ్ ముంబైతో ఆడుతుంది. ఈ మ్యాచ్లో గెలవడంతోపాటు.. చెన్నై గుజరాత్ ను ఓడించాలి. ఇది సాధ్యం కాకపోతే లక్నో చేతిలో బెంగళూరు ఓడిపోవాలి. ఒకవేళ బెంగళూరు గెలిచినా నెట్ రన్ రేట్ తక్కువగా ఉండాలి.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఖాతాలో ప్రస్తుతం 17 పాయింట్లు ఉన్నాయి. ఈ జట్టు లక్నో పై విజయం సాధించాలి. అదే సమయంలో గుజరాత్ లేదా పంజాబ్ జట్లు ఓడిపోవాలి. ఒకవేళ పంజాబ్ జట్టు గెలిచిన నెట్ రన్ రేట్ తక్కువగా ఉండాలి.
ముంబై ఇండియన్స్ ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్ పంజాబ్ జట్టుపై ఖచ్చితంగా గెలవాలి. అంతేకాకుండా బెంగళూరు లేదా గుజరాత్ టైటాన్స్ జట్లలో ఏదో ఒకటి ఓడిపోవాలి. ఒకవేళ ఆ జట్లు విజయం సాధించినా నెట్ రన్ రేట్ తక్కువగా ఉండాలి.
అయితే ఈ నాలుగు జట్లు హోరాహోరీగా ఆడుతున్న నేపథ్యంలో.. టాప్ -2 నిలవడానికి తీవ్రంగా శ్రమిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందువల్లే తదుపరి మ్యాచ్లు తీవ్రమైన ఉత్కంఠ గా సాగుతాయి. బంతి బంతికి విజయ సమీకరణం మారిపోతూ ఉంటుంది. శనివారం నాటి ఢిల్లీ, పంజాబ్ మధ్య జరిగిన పోరు అదే విషయాన్ని నిరూపించింది.