IPL Final Social Buzz : ఈ సీజన్లో బెంగళూరు, పంజాబ్ అద్భుతమైన విజయాలతో ఆకట్టుకున్నాయి. గతాని కంటే భిన్నంగా ఆట తీరును ప్రదర్శించాయి. ఆటగాళ్ల విషయంలో సరికొత్త విధానాన్ని అవలంబించాయి. దీనికి తోడు కోచ్ , సహాయక సిబ్బంది విషయంలోనూ ఎప్పటికప్పుడు సరికొత్త పద్ధతులను అమలు చేశాయి. తద్వారా ఊహించని గెలుపులు సొంతం చేసుకున్నాయి. మధ్యలో కొన్నిసార్లు తడబడినప్పటికీ.. అంతిమంగా విజయాలు సాధించి అలరించాయి. ఇక ఈ సీజన్లో పంజాబ్ జట్టు టేబుల్ టాపర్ గా ప్లే ఆఫ్ వెళ్లిపోయింది. బెంగళూరు రెండవ స్థానాన్ని ఆక్రమించింది. మొత్తంగా ఫైనల్ కూడా ఈ రెండు జట్లు వెళ్లిపోవడం విశేషం. వాస్తవానికి గుజరాత్, ముంబై మీద ఈ రెండు జట్ల కంటే ఎక్కువగా అంచనాలు ఉన్నప్పటికీ.. ఒత్తిడిలో ఆ రెండు జట్లు విఫలమయ్యాయి. తద్వారా ఊహించని ఓటములు ఎదుర్కొని ఇంటికి వెళ్లిపోయాయి. ఇక మొదటి నుంచి కూడా స్థిరమైన ఆట తీరు ప్రదర్శించిన పంజాబ్, బెంగళూరు ఈ సీజన్లో సరికొత్తగా ఆవిర్భవించాయి.
Also REad : అయ్యర్ గెలుపు సీక్రెట్ అదేనట? అందువల్లే ముంబై మీద విజయం సాధ్యమైందట?
ఈ రెండు జట్లు ఫైనల్ వెళ్లడం మాత్రమే కాదు.. ఏ జట్టు విజేతగా ఆవిర్భవించినా సరికొత్త చరిత్ర నమోదవుతుంది. ఎందుకంటే ఈ రెండు జట్లు ఇంతవరకు ఐపీఎల్ ట్రోఫీని అందుకోలేదు. ఐపీఎల్ ట్రోఫీ సాధించాలనే కల ఈ రెండుRoyal Challengers Bengaluru, Punjab Kings, జట్లకు ఎప్పటినుంచో ఉంది. కాకపోతే గతంలో బెంగళూరు ఏకంగా నాలుగు పర్యాయాలు చివరి అంచె దాకా వెళ్ళింది. ఈసారి ఎలాగైనా ట్రోఫీని అందుకోవాలని కన్నడ జట్టు భావిస్తోంది. మరోవైపు అయ్యర్ సారథ్యంలో తొలిసారిగా ట్రోఫీని దక్కించుకొని.. సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలకాలని పంజాబ్ జట్టు భావిస్తోంది. మొత్తంగా ఈ రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుందని మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ ఆనందాన్ని అందిస్తారని పేర్కొంటున్నారు..
ఇక రేపు ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో సోషల్ బజ్ పై స్టార్ స్పోర్ట్స్ ఒక పోస్టర్ విడుదల చేసింది. గత 24 గంటల్లో సోషల్ మీడియాలో నెలకొన్న పరిణామాలు, పోస్టులను వడపోసి స్టార్ స్పోర్ట్స్ ఒక పోస్టర్ విడుదల చేస్తుంది. దాని ప్రకారం రేపు జరిగే ఫైనల్ మ్యాచ్లో పంజాబ్, బెంగళూరులలో.. అయ్యర్ సేనకు 51 శాతం, కన్నడ జట్టుకు 49 శాతం నెటిజన్లు మద్దతు ఇస్తున్నట్టు పేర్కొంది. బెంగళూరు క్వాలిఫైయర్ -1 మ్యాచ్ లో పంజాబ్ జట్టుపై ఏకపక్ష విజయాన్ని సాధించి ఫైనల్ కి వెళ్ళింది. అయితే పంజాబ్ మాత్రం ముంబై జట్టుకు చుక్కలు చూపించి ఫైనల్ దాకా వచ్చింది. అయితే ముంబై పై చేసిన పోరాటం పంజాబ్ జట్టు పై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.