Hari Hara Veera Mallu pre-release Event : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే… ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pavan Kalyan) ప్రస్తుతం పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. హరిహర వీరమల్లు సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి రానటువంటి ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకొని తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి ఇమేజ్ ను తీసుకొచ్చి పెట్టినవే కావడం విశేషం…ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికి తన అభిమానుల కోరిక మేరకు ఆయన సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. జూన్ 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను సినిమా యూనిట్ భారీ రేంజ్ లో చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాయి. ఇక ఇప్పుడు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాదులో ఈ ఈవెంట్ ని భారీ ఎత్తున చేయాలని చూస్తున్నారు. ఈ ఈవెంట్ కిరాజకీయ సినిమా ప్రముఖులు చాలామంది హాజరయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…
Also Read : హరి హర వీరమల్లు’ లో హైలైట్ అయ్యే సన్నివేశాలు ఇవే..కానీ సెకండ్ హాఫ్ రిస్క్ ఉంది!
ఒకవేళ అదే కనక నిజమైతే ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవ్వడమే కాకుండా మెగా అభిమానులందరు చాలా సంతోషపడతారనే చెప్పాలి. ఇక ఈ సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అవ్వబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకి ఇండియా వైడ్ గా భారీ గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో మేకర్స్ అయితే ఉన్నారు.
మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పలు రికార్డు లు కూడా బ్రేక్ అవ్వబోతున్నాయి అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులైతే భారీ కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చేసిన బ్రో (Bro) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఈ సినిమా మీదనే వాళ్ళు భారీ ఆశలు అయితే పెట్టుకున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే పాన్ ఇండియాలో స్టార్ హీరోగా అవతరిస్తాడు. అలాగే తన తోటి హీరోలందరికి పోటీని ఇస్తూ అటు రాజకీయాలను, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళుతున్న హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు..