Ipl Final 2025 : గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా ఐపిఎల్ ఫైనల్ నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. మంగళవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ పోరు జరగనుంది. బెంగళూరు జట్టును ఎంతోమంది సారధులు ముందుకు నడిపించినప్పటికీ ఇంతవరకు ఐపీఎల్ విజేతను చేయలేకపోయారు.. ఇక పంజాబ్ కింగ్స్ పై ఎటువంటి అంచనాలు లేకపోయినప్పటికీ.. అయ్యర్ వచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. జట్టను ఏకంగా టేబుల్ టాపర్ దాకా తీసుకెళ్లాడు.. టాప్ -2 లో ఉన్న ఈ రెండు జట్లలో ఎవరు ట్రోఫీ గెలిచినా సంచలనమే నమోదవుతుంది.
బెంగళూరు జట్టు గతంలో మూడు పర్యాయాలు కన్నడ జట్టు ఐపిఎల్ ఫైనల్ వెళ్ళింది. ప్రతి సందర్భంలోనూ ఓటమిపాలై రన్నర్ అప్ తో సరిపెట్టుకుంది. అయితే ఈసారి కన్నడ జట్టు సరికొత్త ఆట తీరు ప్రదర్శించింది.. ఏకంగా ఫైనల్ దాకా వెళ్ళింది.. ఈ సీజన్లో టేబుల్ టాపర్గా ఉన్న పంజాబ్ జట్టును క్వాలిఫైయర్ -1 లో చిత్తు చేసి ఫైనల్లో ప్రవేశించింది బెంగళూరు.. పంజాబ్ జట్టును క్వాలిఫైయర్-1 లో ఓడించిన నేపథ్యంలో.. ఫైనల్ మ్యాచ్ లోనూ అదే జోరు చూపించాలని కన్నడ జట్టు భావిస్తోంది. ఇక పంజాబ్ జట్టు 2014లో మాత్రమే ఒకసారి ఐపిఎల్ ఫైనల్ దాకా వెళ్ళింది..
క్వాలిఫైయర్ -1 లో ఊహించని ఓటమి ఎదుర్కోవడంతో పంజాబ్ ఒక్కసారిగా డీలా పడిపోయింది. నాడు కన్నడ జట్టు దూకుడు వల్ల 101 పరుగులకే కుప్పకూలాల్సి వచ్చింది. అంతటి విపత్కర పరిస్థితి నుంచి తేరుకున్న పంజాబ్ జట్టు.. ఏకంగా ఐదుసార్లు విద్యుత్ గా నిలిచిన ముంబైని ఓడించింది. క్వాలిఫైయర్ -2 లో దుమ్మురేపింది. మ్యాచ్లో జట్టను గెలిపించిన అయ్యర్ పై ఇప్పుడు ట్రోఫీ అందించే బాధ్యత కూడా పడింది. ఇతడు మాత్రమే కాకుండా ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, ఇంగ్లిస్, శశాంక్ సింగ్, స్టోయినీస్ తమ స్థాయిలో సత్తా చూపించడానికి రెడీగా ఉన్నారు.. అయితే జాన్సన్ లేకపోవడంతో పంజాబ్ బౌలింగ్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది.. ఇక ముంబై తో జరిగిన మ్యాచ్లో అర్ష్ దీప్ సింగ్ సత్తా చాటలేకపోయాడు. చాహల్ గూడా దారుణంగా పరుగలిచ్చాడు. అయితే వీరంతా కూడా తమ లోపాలను సవరించుకోవాల్సి ఉంది.
Also Read : రేపటి ఫైనల్ లో బెంగళూరా? పంజాబా? ఏ జట్టు విజయం సాధిస్తుందంటే?
బెంగళూరులో ప్రధాన ఆకర్షణగా విరాట్ కోహ్లీ ఉంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం అతడు 614 పరుగులతో ప్రస్తుత ఐపీఎల్ లో టాప్ -5 లో కొనసాగుతున్నాడు. సాల్ట్ తో కలిసి అద్భుతమైన ఆరంభాలు అందిస్తున్నాడు. మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి లేకుండా చూస్తున్నాడు. ఇదే మైదానంలో, పంజాబ్ జట్టుపై అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. మీరు మాత్రమే కాకుండా మాయాంక అగర్వాల్, జితేష్ శర్మ అదరగొడుతున్నారు. కెప్టెన్ పాటిదార్ మాత్రం నిరాశ పరుస్తున్నాడు.. డేవిడ్ ఫిట్ నెస్ పై సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. హేజిల్, భువి, దయాల్, తుషారా బౌలింగ్ భారాన్ని మోస్తున్నారు.. తమ స్థాయికి తగ్గట్టుగా బెంగళూరు అదరగొడితే మాత్రం పంజాబ్ జట్టుకు ఇబ్బంది తప్పదు.
బెంగళూరు (అంచనా)
సాల్ట్, పాటిదార్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, లివింగ్ స్టోన్, షెఫర్డ్, జితేష్ శర్మ, భువనేశ్వర్ కుమార్, దయాల్, హేజిల్ వుడ్, అయాంక్ అగర్వాల్, కృణాల్ పాండ్యా.
పంజాబ్
అయ్యర్ (కెప్టెన్), చాహల్, ప్రభ్ సిమ్రాన్ సింగ్, వదేరా, జెమిసన్, చాహల్, ఇంగ్లిస్, స్టోయినీస్, ప్రియాన్ష్ ఆర్య, ఓమర్జాయ్, అర్ష్ దీప్ సింగ్.