IPL 2024: ఐపీఎల్ వేలం : చెన్నై విడుదల చేసిన ప్లేయర్స్ వీళ్లే…

ఇప్పటికే ఆ టీమ్ నుంచి భారీ డబ్బులు పెట్టి కొన్న బెన్ స్టోక్స్ ని తీసేసినట్టుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు.

Written By: Gopi, Updated On : November 26, 2023 12:23 pm

IPL 2024

Follow us on

IPL 2024: వరల్డ్ కప్ ముగిసిందో లేదో ఐపీఎల్ 2024 మినీ యాక్షన్ కి సర్వం సిద్ధం అవుతుంది ఇప్పటికే అన్ని టీమ్ లు కూడా వాళ్ళ టీం నుంచి రిలీజ్ చేసే ప్లేయర్ల లిస్టుని ఐపీఎల్ పాలక మండలికి సమర్పిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో 2023 ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ టీం లో నుంచి ఏ ప్లేయర్ ను రిలీజ్ చేస్తున్నారు ఇంకే ప్లేయర్ ని రిటైన్ చేసుకుంటున్నారు అనేదాని పైనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆ టీమ్ నుంచి భారీ డబ్బులు పెట్టి కొన్న బెన్ స్టోక్స్ ని తీసేసినట్టుగా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఇక దానికి తగ్గట్టుగానే ఈయనతో పాటు టీమ్ నుంచి వైదొలిగే ప్లేయర్లు ఎవరు అనేదానిపైన సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. అయితే చెన్నై టీం నుంచి రిలీజ్ చేసిన ప్లేయర్ లిస్టు ఒకసారి చూసుకుంటే…

అంబటి రాయుడు 2023 ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఆయన ఐపీఎల్ మొత్తానికి రిటర్మెంట్ ప్రకటించాడు…

బెన్ స్టోక్స్, డ్వెన్ ప్రటోరియస్,సిసండ మగల
లాంటి ప్లేయర్లని చెన్నై టీం ఆక్షన్ లోకి రిలీజ్ చేస్తుంది…

ఇక చెన్నై రిటైన్ చేసుకున్న ప్లేయర్ల లిస్టును ఒకసారి మనం చూసుకున్నట్లయితే…

మహేంద్ర సింగ్ ధోని
డేవిన్ కన్వే
రుతురాజ్ గైక్వాడ్
మొయిన్ అలీ
రవీంద్ర జడేజా
సేనాపతి
తుషార్ దేశ్పాండే
దీపక్ చాహర్
మిచెల్ సాంటన్నర్
మహేష్ తిక్షణా
సిమ్రాన్ జిత్ సింగ్
మతిషా పతిరానా
ఆకాశ్ సింగ్
ప్రశాంత్ సోలంకి
రాజీవ్ వర్ధన్ హంగార్కర్
శివం ధూబే
అజంకే రహానే
నిశాంత్ సింగ్
షైన్ రషీద్
అజయ్ మండల్
భగత్ వర్మ
లాంటి ప్లేయర్లను ప్రస్తుతానికి చెన్నై టీం రిటైన్ చేసుకుంది. ఇక డిసెంబర్ 19 వ తేదీన దుబాయ్ వేదిక గా ఐపీఎల్ 2024 కి సంబందించిన మిని ఆక్షన్ అనేది జరగ నుండగా అందులో మరి కొందరిని తీసుకునే అవకాశం అయితే ఉంది…

ఇక ముఖ్యంగా చెన్నై టీం కి కెప్టెన్ ఎవరు అనే దానిమీద సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ధోని ప్రస్తుతం ఉన్న ఫిట్ నెస్ ప్రకారం ఈ ఒక్క సీజన్ ఆడి తను రిటర్మెంట్ ప్రకటించే అవకాశం అయితే ఉంది.ఇక దాంతో చెన్నై టీం ని ముందుండి నడిపించే కెప్టెన్ ఎవరు అని చెన్నై యాజమాన్యం ఎదురుచూస్తూ ఉండగా రుతురాజ్ గైక్వాడ్ ని చెన్నై టీమ్ కి కెప్టెన్ గా నియమించే అవకాశాలు అయితే ఉన్నాయి… ఎందుకంటే గైక్వాడ్ సారథ్యం లో ఇండియన్ టీమ్ ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది కాబట్టి చెన్నై టీమ్ కి కూడా ఆయనే కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం అయితే ఉంది…