IPL 2026 Trade Update: ఐపీఎల్ లో వేగంగా పరుగులు తీసే ఆటగాళ్లకు విపరీతమైన విలువ ఉంటుంది. వారిని కొనుగోలు చేయడానికి యాజమాన్యాలు విపరీతమైన పోటీ పడుతుంటాయి. కోట్లకు కోట్లు ఖర్చు పెడుతుంటాయి. కానీ ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా పరుగుల వేటగాళ్లకు రెండు యాజమాన్యాలు చుక్కలు చూపిస్తున్నాయి. కొనుగోలు చేయడానికి ఏమాత్రం ఆసక్తి చూపించకపోగా.. యే హే పో అంటూ దూరం పెడుతున్నాయి. ఇంతకీ ఈ కథ ఏమిటో.. ఆ ప్లేయర్లు ఎవరు.. ఆ యాజమాన్యాలు సంగతి.. వీటన్నింటిపై ఆసక్తికరమైన కథనం ఇది..
ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ కు పేరుంది. ఈ జట్టు నుంచి ఇటీవల రవిచంద్రన్ అశ్విన్ వెళ్లిపోయాడు. దీంతో అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను తీసుకోవాలని చెన్నై యాజమాన్యం భావిస్తోంది. ప్రస్తుతం సుందర్ గుజరాత్ టైటాన్స్ లో ఉన్నాడు. గుజరాత్ జట్టుకు ప్రధాన కోచ్ గా ఆశిష్ నెహ్ర కొనసాగుతున్నాడు. సుందర్ ను ట్రేడ్ చేయడానికి అతడు అంతగా ఆసక్తిని చూపించడం లేదు. అంతేకాదు సుందర్ ను వదులుకోవడానికి గుజరాత్ యాజమాన్యం సిద్ధంగా లేకపోవడంతో.. చెన్నై జట్టుతో చర్చలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. పైగా సుందర్ మీద గుజరాత్ యాజమాన్యం భారీగా పెట్టుబడి పెట్టింది.
కేఎల్ రాహుల్ ఢిల్లీ జట్టు తరఫున ఆడుతున్నాడు.. అతడిని తమ జట్టులోకి తీసుకోవాలని కోల్ కతా నైట్ రైడర్స్ ఎప్పటినుంచో భావిస్తోంది. అతడు వికెట్ కీపర్, ఓపెనర్ గా అద్భుతంగా ఆడతాడు. అందువల్లే కోల్ కతా అతడిని జట్టులోకి తీసుకోవాలని భావిస్తోంది. రాహుల్ ను ఇచ్చేస్తే.. దానికి బదులుగా రింకూ సింగ్ లేదా వరుణ్ చక్రవర్తిని ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది రింకూ సింగ్ అద్భుతమైన ఫినిషర్. వరుణ్ చక్రవర్తి మిస్టీరియస్ స్పిన్ బౌలర్. వీరిద్దరిని వదులుకోవడానికి కోల్ కతా యాజమాన్యం ఏమాత్రం సిద్ధంగా లేదు. పైగా రాహుల్ ను ఢిల్లీ నుంచి తీసుకోవడానికి అంతగా సొమ్ము కోల్ కతా వద్ద లేదని తెలుస్తోంది. దీనివల్ల కోల్ కతా – రాహుల్ డీల్ ఆగిపోయిందని తెలుస్తోంది.
ఈ రెండు మాత్రమే కాకుండా, 150 యాజమాన్యాలు కూడా అగ్రశ్రేణి టీమిండియా ప్లేయర్లను కాపాడుకోవడానికి ప్రయారిటీ ఇస్తున్నాయి. ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు, సమానమైన ప్రతిభ ఉన్న ప్లేయర్లను తిరిగి పొందలేకపోతే ఆ నష్టం తీవ్రంగా ఉంటుంది. అందువల్ల యాజమాన్యాలు ప్లేయర్ల ట్రేడ్ విషయంలో అంతగా ఆసక్తికరంగా లేవు. అందువల్లే సుందర్ గుజరాత్ లో.. రాహుల్ ఢిల్లీలో కొనసాగుతారని తెలుస్తోంది. మరోవైపు ఈ రెండు ట్రేడ్ లు నిలిచిపోయిన నేపథ్యంలో.. మిగతా ప్లేయర్ల విషయంలో కూడా ఇలానే ఉంటుందని తెలుస్తోంది.