Homeక్రీడలుక్రికెట్‌IPL 2026 Points Table Latest Update: రెండు రౌండ్లు ముగిశాయి.. ఐపీఎల్ లో టాప్...

IPL 2026 Points Table Latest Update: రెండు రౌండ్లు ముగిశాయి.. ఐపీఎల్ లో టాప్ 4 జట్లు ఇవే..

IPL 2026 Points Table Latest Update: ఐపీఎల్ ఉత్కంఠ గా సాగుతోంది. భారీగా పరుగులు నమోదైన మ్యాచ్ లు, వేగంగా వికెట్లు పడిపోయిన మ్యాచ్ లనూ అభిమానులు ఆస్వాదిస్తున్నారు. సాయంత్రమైతే చాలు ఐపీఎల్ ఫీవర్ తో టీవీలు, ఫోన్లకు అతుక్కుని పోతున్నారు.

ఇప్పటివరకు ఐపిఎల్ 2026 లో మొదటి రెండు రౌండ్లు పూర్తయ్యాయి. కొన్ని జట్లు మూడు.. ఇంకొన్ని జట్లు రెండు రౌండ్ల మ్యాచ్లను పూర్తి చేశాయి. ఈ మ్యాచ్ లలో వచ్చిన ఫలితాలను పరిశీలిస్తాయి.. గత ఏడాది ఫైనల్ వెళ్ళిన పంజాబ్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. డిపెండింగ్ ఛాంపియన్ గా ఉన్న బెంగళూరు రెండవ స్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్ మూడు, ఢిల్లీ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి. ఐదో మ్యాచ్లో హైదరాబాద్ ఉంది.. హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడింది. కేవలం ఒక దాంట్లో మాత్రమే విజయం సాధించింది. ముంబై జట్టు ఆరవ స్థానంలో ఉంది. లక్నో ఏడవ స్థానంలో కొనసాగుతోంది. చెన్నై, కోల్ కతా, గుజరాత్ ఇంతవరకు ఒక మ్యాచ్ కూడా గెలవలేదు. అవి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్నాయి.

గత ఏడాది ఫైనల్ వెళ్లిన పంజాబ్, బెంగళూరు ఈ ఏడాది కూడా సూపర్ ఫాం కొనసాగిస్తున్నాయి. రెండు జట్లలో అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. వీరంతా కూడా మైదానంలో సూపర్ ఆట తీరు ప్రదర్శిస్తున్నారు. అందువల్లే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లు వరుస విజయాలు సాధిస్తున్నాయి. ఆ జట్ల ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే ఈ ఏడాది కూడా ప్లే ఆఫ్ వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని కలిసి వస్తే ఈ రెండు జట్లు మళ్లీ ఫైనల్ వెళ్లే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.

ముంబై, రాజస్థాన్ జట్లకు కూడా తదుపరి దశకు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ జట్టు ఇదే ఊపు కొనసాగిస్తే తిరుగు ఉండదు. హైదరాబాద్ జట్టు ఉత్తమ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తొలి మ్యాచ్లో ఓడిపోయిన హైదరాబాద్.. రెండో మ్యాచ్లో గెలిచింది.. మూడో మ్యాచ్లో చేతులారా ఓటమిని కొని తెచ్చుకుంది.. సాధించిన పాయింట్ల ఆధారంగా ఇప్పటివరకు ఆయా జట్ల స్థానాలు పై విధంగా ఉన్నాయి. ఒకవేళ ఊహించని ఓటములు ఎదురైతే.. స్థానాలు మారే అవకాశం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular