IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కు సంబంధించి అన్ని జట్లు రిటెన్షన్, రిలీజ్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాయి. అన్ని జట్లు కొంతమంది ప్లేయర్లను రిలీజ్ చేయగా.. మిగతావారిని జట్టులో ఉంచుకున్నాయి. కొన్ని జట్ల మధ్య ట్రేడ్ ప్రక్రియ కూడా జరిగింది. బీసీసీఐ విధించిన గడువు ముగియడంతో.. అన్ని జట్లకు సంబంధించిన ప్లేయర్ల వివరాలు బయటకు వచ్చాయి.
కోల్ కతా నైట్ రైడర్స్: ఈ జట్టు అండ్రి రస్సెల్, వెంకటేష్ అయ్యర్, క్వింటన్ డికాక్, సిసోడియా, మయాంక్ మార్కండే, స్పెన్సర్ జాన్సన్, నోర్జ్ వంటి ప్లేయర్లను రిలీజ్ చేసింది. గతంలో వెంకటేష్ అయ్యర్ కు ఈ జట్టు ఏకంగా 23 కోట్లు చెల్లించింది. ఈ జట్టు వద్ద పర్సు వేల్యూ దాదాపు 64.3 కోట్లు ఉంది. మినీ వేలంలో పాల్గొనడానికి ఈ జట్టు వద్ద అత్యధికంగా నగదు ఉంది.
ముంబై ఇండియన్స్: ఈ జట్టు సత్యనారాయణ (30 లక్షలు), రీసి టోప్లే (75 లక్షలు), కేఎల్ శ్రీ జింత్ (30 లక్షలు), కరణ్ శర్మ (50 లక్షలు), అర్జున్ టెండూల్కర్ (30 లక్షలు)(ట్రేడ్ అవుట్), జాకోబ్స్ (30 లక్షలు), ముజీబ్ ఉర్ రెహమాన్ (రెండు కోట్లు), లిజార్డ్ విలియమ్స్ (75 లక్షలు), విగ్నేష్ పుతుర్(30 లక్షలు) రిలీజ్ చేసింది. ఈ జట్టు యాజమాన్యం ఖాతాలో 2.75 కోట్ల పర్స్ అమౌంట్ మాత్రమే మిగిలి ఉంది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్: ఈ జట్టు జోష్ ఇంగ్లిస్, మాక్స్ వెల్, ఆరోన్ హార్డీ, కులదీప్ సీన్, ప్రవీణ్ దుబే మంటి ప్లేయర్లను రిలీజ్ చేసింది.. ఈ జట్టు వద్ద 11.5 కోట్ల పర్స్ అమౌంట్ ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్: రాహుల్ త్రిపాటి, వన్స్ బేడి, రచిన్ రవీంద్ర, సామ్ కరణ్, మతిషా పతీరణ, షేక్ రషీద్, కమలేష్, దీపక్ హుడా, ఆండ్రు సిద్ధార్థ.. ఈ జట్టు వద్ద 43.4 కోట్ల పర్స్ వేల్యూ ఉంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: స్వస్తిక్, లివింగ్ స్టోన్, మనోజ్, బ్లెస్సింగ్, ముజార్బానీ, మోహిత్, మయాంక్ అగర్వాల్, టిమ్ సియి పెర్ట్, రుమారియో షెఫర్డ్, లుంగీ ఎంగిడి వంటి ప్లేయర్లను రిలీజ్ చేసింది. ఈ జట్టు వద్ద 16.4 కోట్ల పర్స్ వేల్యూ ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్: ఆర్యన్, మార్క్రం, డేవిడ్ మిల్లర్, బ్రిట్జ్కీ, నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, శార్దూల్ ఠాగూర్ (ట్రేడ్), ఆకాశదీప్, రవి, సమర్ జోసెఫ్, యువరాజ్ చౌదరి, హంగార్కేకర్ వంటి ప్లేయర్లను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ జట్టు వద్ద 22.9 కోట్ల పర్స్ వేల్యూ ఉంది.
గుజరాత్ టైటాన్స్: రూథర్ఫోర్డ్(ట్రేడ్), మహిపాల్, శనక, కోయిట్జీ, కుల్వంత్, కరీం వంటి ప్లేయర్లను వదిలేసింది. ఈ జట్టు వద్ద 12.9 కోట్ల పర్స్ వేల్యూ ఉంది.
సన్ రైజర్స్ హైదరాబాద్: ఈ జట్టులో అభినవ్ మనోహర్, అధర్వ, సచిన్, ముల్డర్, జంప, చాహర్, షమీ, సమర్జిత్ సింగ్ ను రిలీజ్ చేసింది. ఈ జట్టు పర్స్ వేల్యూ 25.5 కోట్లు ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్: జాక్ ఫెజర్, డోనావన్, అటల్, మానవ కుమార్, మోహిత్, దర్శన్, డు ప్లేసెస్.. వంటి ప్లేయర్లను రిలీజ్ చేసింది. ఈ జట్టు వద్ద 21.8 కోట్ల పర్స్ వేల్యూ ఉంది.
రాజస్థాన్ రాయల్స్: రాథోడ్, నితీష్ (ట్రేడ్), సంజు (ట్రేడ్), హస రంగ, తీక్షణ, ఆకాష్, అశోక్, కుమార కార్తికేయ.. వంటి ప్లేయర్లను రిలీజ్ చేసింది.. ఈ జట్టు వద్ద 16.5 కోట్ల పర్స్ వేల్యూ ఉంది.