IPL 2026 RCB Vs SRH Match Preview: చిన్నస్వామి స్టేడియంలో నేడు ప్రారంభమయ్యే ఐపీఎల్ మ్యాచ్‌లో హైదరాబాదు, బెంగళూరు పోటీ పడబోతున్నాయి. రెండు జట్లలో అద్భుతమైన ప్లేయర్లు ఉన్న నేపథ్యంలో పోటీ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది..పిచ్ కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ.. పరుగులు వచ్చే అవకాశం ఉందని క్యూరేటర్ చెబుతున్నారు.
Also Read: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాజీ ప్రేయసి.. రీ యూనియన్ అదిరిపోయింది..
సాధారణంగా ఐపీఎల్లో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకుంటుంది. అనివార్య పరిస్థితిలో మాత్రమే బౌలింగ్ వైపు ఆసక్తిని చూపిస్తుంది. ఇక చిన్న స్వామి స్టేడియంలో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. డ్యూ లాంటిది కనిపించడం లేదని క్యూ రేటర్ చెబుతున్నారు. గడచిన పది రోజులుగా ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు ప్లేయర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. వారంతా కూడా పిచ్ కు పూర్తిగా అలవాటు పడ్డారు. సాయంత్రం పూట ప్లేయర్లు ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో అంతగా మంచు కురవడం లేదు. సాధారణంగా చేజింగ్ చేసే జట్టుకు మంచు కురిస్తే.. పరుగులు తీయడం కష్టమవుతుంది. మంచు వల్ల బంతి గమనం అనుకున్నంత వేగంగా సాగదు. అలాంటప్పుడు రన్స్ స్కోర్ చేయాలంటే బ్యాటర్లు ఇబ్బంది పడకు తప్పదు.
ప్రారంభ మ్యాచ్‌లో ఒకవేళ హైదరాబాద్ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ టాస్ ఓడిపోయి.. బౌలింగ్ చేయాల్సి వస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే చేజింగ్ సమయంలో మంచు అంతగా కురవడం లేదు. పైగా ప్రారంభ ఓవర్లలో అభిషేక్ శర్మ.. కిషన్.. క్లాసెన్.. హెడ్ గనక తమ స్థాయిలో ఆకట్టుకుంటే హైదరాబాద్ జట్టుకు తిరుగు ఉండదు. పైగా బెంగళూరు మైదానం హెడ్ కు కొట్టినపిండి. కిషన్ కూడా ఈ మైదానం మీద స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతున్నాడు. అభిషేక్ శర్మ కూడా దూకుడుగా బ్యాట్ ను తిప్పుతున్నాడు. ఈ నేపథ్యంలో ఒకవేళ టాస్ ఓడిపోయిన కూడా.. హైదరాబాద్ జట్టు గెలుపుకు డోకా ఉండదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
ప్రారంభంలో బౌలింగ్ చేస్తే హైదరాబాద్ జట్టు బెతల్.. విరాట్ కోహ్లీకి కళ్ళెం వేస్తే బెంగళూరు ఇబ్బంది పడుతోంది. పైగా గడిచిన సీజన్లో హోమ్ గ్రౌండ్ లో బెంగళూరు మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. దీంతో నైతికంగా ఆ జట్టు ఒకరకంగా ఆత్మ రక్షణ ధోరణిలో పడింది. దీనిని హైదరాబాద్ ప్లేయర్లు అడ్వాంటేజ్ గా తీసుకుంటే తిరుగు ఉండదు. ప్రారంభ ఓవర్లలో హైదరాబాద్ బౌలర్లు పదునైన బంతులు వేస్తే బెంగళూరు భారీ స్కోర్ చేసే అవకాశం ఉండదు. చేజింగ్ సమయంలో క్రునాల్ పాండ్యా వంటి మిస్టేరియస్ బౌలర్ ను అడ్డుకుంటే హైదరాబాద్ విజయానికి అడ్డు ఉండదు. అందువల్లే హైదరాబాద్ ప్లేయర్లు బ్యాటింగ్ తో పాటు.. బౌలింగ్ కూడా విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. గడచిన పది రోజులుగా హైదరాబాద్ ప్లేయర్లు చిన్న స్వామి స్టేడియంలో చెమటలు చిందిస్తున్నారు. మరి ఆ కష్టానికి ప్రతిఫలం మరికొద్ది గంటల్లో లభించబోతోంది.