IPL 2025 : మార్చి 22 నుంచి ఐపీఎల్ సీజన్ మొదలవుతుంది. గత సీజన్లో హైదరాబాద్ జట్టు ఫైనల్ మ్యాచ్లో కోల్ కతా చేతిలో ఓటమిపాలైంది. దీంతో ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలని హైదరాబాద్ జట్టు భావిస్తోంది. ఇందులో భాగంగానే జట్టు ఆటగాళ్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు. ప్రత్యర్థులను ఓడించడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కమిన్స్ జట్టుకు అందుబాటులోకి వస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత కారణాల వల్ల కమిన్స్ ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్నాడు. అభిషేక్ శర్మ, హెడ్, క్లాసెన్ వంటి వారితో హైదరాబాద్ జట్టు అత్యంత బలంగా ఉంది. దీంతో ఈసారి హైదరాబాద్ జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. మరోవైపు హైదరాబాద్ జట్టుకు బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో.. ప్రేక్షకుల అభిమానం విపరీతంగా ఉంది.
Also Read : డ్రెస్సింగ్ రూంలో టెన్షన్.. హార్ధిక్ పాండ్యా నవ్వుకున్నాడట.. అదీ గట్స్ అంటే
టికెట్లు అందుబాటులో..
మార్చి 22 నుంచి ఐపీఎల్ సీజన్ మొదలు కాబోతోంది. హైదరాబాద్లో జరిగే రెండు మ్యాచ్లకు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి ఆన్ లైన్ లో టికెట్లను అందుబాటులో ఉంచారు. దీంతో క్రికెట్ అభిమానులు టికెట్లను కొనుగోలు చేయడానికి విపరీతంగా పోటీపడ్డారు. రెండు టికెట్లు కొనుగోలు చేస్తే ఒక జెర్సీ ఉచితంగా ఇస్తామని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రకటించింది.. ఇక 23న రాజస్థాన్, 27న లక్నోతో హైదరాబాద్ జట్టు పోటీ పడనుంది. ఇక ఈ టికెట్లు జొమాటో కొత్త యాప్ https://www.district.in/ లో అందుబాటులో ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు ఈ యాప్ లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు.. హైదరాబాద్ జట్టు గత సీజన్లో రన్నరప్ గా నిలిచింది. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే జట్టు కూర్పు విషయంలో పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. ఇటీవల జరిగిన మెగా వేలంలో అత్యంత ప్రతిభావంతమైన ఆటగాళ్లను సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కొనుగోలు చేసింది. దీంతో ఈసారి హైదరాబాద్ అన్ని జట్లకు గట్టి పోటీ ఇస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా హైదరాబాద్ జట్టు కు విశేషమైన అభిమాన గణం ఉన్న నేపథ్యంలో.. కచ్చితంగా విజయాలు సాధిస్తుందని వారు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ జట్టుకు కమిన్స్ నాయకత్వం వహిస్తున్నాడు. అతని ఆధ్వర్యంలో హైదరాబాద్ జట్టు గత ఏడాది రన్నరప్ గా నిలిచింది. గ్రూప్ దశలో, నాకౌట్ దశలో అద్భుతమైన ఆట తీరు చూపించింది. అందువల్లే ఆ జట్టుపై ఈసారి కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమాదకరమైన హెడ్, అభిషేక్ శర్మ హైదరాబాద్ జట్టులో ఉండడంతో పరుగుల వరద పారడం ఖాయమని అంచనాలు వెలవడుతున్నాయి.
Also Read : ఈసారి SRH ఐపీఎల్ షెడ్యూల్ ఎలా ఉందంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని మ్యాచ్ లు జరుగుతాయంటే..