IPL 2025 RCBvPBKS Final : బెంగళూరు ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. ఫైనల్ మ్యాచ్లో ఒత్తిడికి గురయ్యారు. కీలకమైన భాగస్వామ్యాలు నమోదు చేయడంలో విఫలమయ్యారు. వైపు పంజాబ్ కెప్టెన్ అయ్యర్.. ఉన్న బౌలర్లతోనే అద్భుతంగా బౌలింగ్ చేయించి ఆకట్టుకున్నాడు. సాల్ట్ 16, విరాట్ కోహ్లీ 43, మయాంక్ అగర్వాల్ 24, పాటిదార్ 26, లివింగ్ స్టోన్ 25, జితేష్ శర్మ 24, రోమారియో షెఫర్డ్ 17, పాండ్యా నాలుగు పరుగులు చేశారు.
పంజాబ్ బౌలర్లలో జేమీ సన్ మూడు, అర్ష్ దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఓమర్ జాయ్, విజయ్ కుమార్ వైషాక్, చాహల్ చెరి ఒక వికెట్ పడగొట్టారు. ఇక చివరి ఓవర్ లో అర్ష్ దీప్ సింగ్ చివరి ఓవర్ లో మూడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, పాండ్యా వికెట్లను అర్ష్ దీప్ సింగ్ పడగొట్టాడు. తద్వారా బెంగళూరు జట్టు 20 ఓవర్లు పూర్తిస్థాయిలో బ్యాటింగ్ చేసి.. 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. పంజాబ్ ఎదుట 191 రన్స్ టార్గెట్ విధించింది. ఒకవేళ ఈ టార్గెట్ గనుక ఫినిష్ చేస్తే పంజాబ్ జట్టు 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత తొలిసారి ఐపిఎల్ ట్రోఫీని దక్కించుకుంటుంది. అంతేకాదు రెండు భిన్నమైన జట్లను రెండు సీజన్లో విజేతగా నిలిపిన ఘనత అయ్యర్ కు దక్కుతుంది.
వాస్తవానికి లివింగ్ స్టోన్, జితేష్ శర్మ దూకుడు గానే బ్యాటింగ్ మొదలు పెట్టినప్పటికీ.. వాటిని భారీ భాగస్వామ్యాలుగా నమోదు చేయలేకపోయారు. ఒక సందర్భంలో పంజాబ్ బౌలర్ జెమి సన్ భారీగా పరుగులు ఇచ్చినప్పటికీ.. పంజాబ్ బౌలర్లు మరొకసారి తమ పట్టు నిరూపించుకున్నారు.. మొత్తంగా బెంగళూరు జట్టును 190 పరుగులకు నిలిపివేశారు.. మొత్తంగా ప్లాట్ పిచ్ మీద 200 పరుగుల లోపు స్కోరును నమోదు చేయించడంతో.. మ్యాచ్ గెలుస్తామని ఆశలను అభిమానుల్లో పంజాబ్ ప్లేయర్లు పెంచారు.