IPL 2025 : నాడు చేసిన వ్యాఖ్యలకు తగ్గట్టుగానే అయ్యర్ క్వాలిఫైయర్ -2 లో అదరగొట్టాడు. ముంబై జట్టుకు చుక్కలు చూపించి.. తన జట్టుకు ఒంటి చేత్తో విజయం అందించాడు.. ఇక ఫైనల్ మ్యాచ్లో అదరగొడతాడని.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడని.. కచ్చితంగా విజయం సాధించేలా చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ కావడంతో ఆశలు మొత్తం అడియాసలయ్యాయి. ఆటగాళ్లు ఒత్తిడి తట్టుకోలేక వెంట వెంటనే అవుట్ కావడంతో.. పంజాబ్ జట్టు తీవ్రమైన ఇబ్బందిలో కూరుకుపోయింది. ఫలితంగా 18 సంవత్సరాల కలను నెరవేర్చుకోలేకపోయింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ పంజాబ్ జట్టు ఇలా ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. అయితే క్రికెట్ విశ్లేషకులు మాత్రం పంజాబ్ ఓటమికి అనేక కారణాలను చెబుతున్నారు. ఇంతకీ ఆ కారణాలు ఏంటంటే..
పంజాబ్ జట్టు ఎదుట బెంగళూరు 191 స్కోర్ టార్గెట్ విధించింది.. వాస్తవానికి ఈ మైదానంలో క్రితం మ్యాచ్ లో ముంబై పై 200+ స్కోర్ టార్గెట్ ను పంజాబ్ ఫినిష్ చేసింది. అయితే కన్నడ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ప్రీతి జింటా జట్టు 191 రన్స్ టార్గెట్ రీచ్ కాలేకపోయింది.. పంజాబ్ ఓపెనర్లు, నెహల్ వదేరా నెమ్మదిగా ఆడారు. వీరు కనుక జోరు చూపించి ఉంటే పంజాబ్ పరిస్థితి మరో విధంగా ఉండేది. పంజాబ్ కెప్టెన్ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ కావడం ఆ జట్టును కోలుకోలేని దెబ్బతీసింది. గెలుపు ముందు బోల్తా పడేలా చేసింది. ఇక ఒక ఓవర్ లో నేహల్ వదేరా, స్టోయినీస్ అవుట్ కావడంతో మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఒత్తిడిని తట్టుకోలేక ఆటగాళ్లు విఫలం కావడం కూడా అయ్యర్ సేన ఓటమికి కారణమైంది. మరీ ముఖ్యంగా బెంగళూరు బౌలర్ కృణాల్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. 4 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన అతడు.. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇది పంజాబ్ జట్టుకు దిమ్మతిరిగే ఫలితాన్ని ఇచ్చింది.. తనకు మాత్రమే సాధ్యమైన బంతులు వేసి పాండ్యా అదరగొట్టాడు.. ఒకవేళ అయ్యర్ కనుక మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే.. మరో ఎండ్ నుంచి ఇతర ప్లేయర్లు సహకరించి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. పంజాబ్ జట్టు 18 సంవత్సరాల కలను నెరవేర్చుకునేది. గెలుపు ముందు బోర్లా పాఠంతో పంజాబ్ జట్టు ప్లేయర్లు కన్నీటి పర్యంతమయ్యారు. అభిమానులు కూడా మైదానంలో ఏడ్చేశారు. ఇక ప్రీతిజింతా అయితే తన జట్టు ఓడిపోతున్న తీరు చూడలేక తట్టుకోలేకపోయింది. మొత్తంగా ఈ మ్యాచ్ కన్నడ అభిమానులకు అద్భుతమైన ఆనందాన్ని అందిస్తే.. ప్రీతి జింటా అభిమానులకు మాత్రం తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
Also Read : మరికొద్ది క్షణాల్లో మ్యాచ్.. ఐసీసీ చైర్మన్ బెంగళూరు ఆటగాళ్ల హోటల్ కు ఎందుకు వెళ్ళినట్టు?