IPL 2025 Players Performance: ఐపీఎల్ లో కార్పొరేట్లు 2008లోనే ప్రవేశించినప్పటికీ.. గత కొంతకాలంగా వీరి ప్రమేయం మరింత పెరిగిపోయింది. మైదానంలో టికెట్ల విక్రయం నుంచి మొదలుపెడితే యాడ్స్ ఎండార్స్మెంట్ వరకు.. కోట్లకు కోట్లు సంపాదన వస్తున్న నేపథ్యంలో.. కార్పొరేట్లు ఐపీఎల్ లో మరింతగా పెట్టుబడులు పెడుతున్నారు. కొంతమంది ఆటగాళ్లకు ఔరా అనే రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. అయితే కార్పొరేట్లు అంచనా వేసిన ఆటగాళ్లు అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. ప్రతి ఐపీఎల్ సీజన్లో ఇలాంటిది కామనే అయినప్పటికీ.. ఈసారి మాత్రం కొంతమంది ప్లేయర్లు కార్పొరేట్లు వేసుకున్న అంచనాలను తలకిందులు చేశారు. వీరి కోసం ఆయా యాజమాన్యాలు కోట్లకు కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఉపయోగం అంటూ లేకుండా పోయింది. చివరికి వీరిని ప్రమోట్ చేసేందుకు చేసిన ఖర్చు మందం కూడా పరుగులు చేయలేకపోవడం యాజమాన్యాలను కలవరపాటుకు గురి చేస్తోంది .
ఈసారి ఐపీఎల్లో రిషబ్ పంత్ మీద విపరీతమైన హైప్స్ ఉండేవి. లక్నో జట్టు యాజమాన్యం అతడి పై భారీ అంచనాలు పెట్టుకుంది. భారీగానే ఖర్చు చేసింది. కానీ అతడు అత్యంత దారుణంగా ఆడాడు. ఈ సీజన్ మొత్తంలో ఇప్పటివరకు 151 పరుగులు మాత్రమే చేశాడు. ఒక రకంగా. బిలో యావరేజ్ ప్లేయర్ కంటే తక్కువ స్థాయిలో అతడు పరుగులు చేయడం.. లక్నో జట్టు విజయాలను తీవ్రంగా ప్రభావితం చేసింది..
ఇక హైదరాబాద్ జట్టు యాజమాన్యం మహమ్మద్ షమీ మీద విపరీతమైన అంచనాలు పెట్టుకుంది. కానీ అతడు 6 వికెట్లు మాత్రమే తీశాడు. దారుణంగా పరుగులు ఇచ్చాడు. దీంతో కొన్ని మ్యాచ్లలో అతడిని హైదరాబాద్ యాజమాన్యం రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసింది.
ఇక గత సీజన్లో బెంగళూరు కు ఆడిన మ్యాక్స్ వెల్.. ఆ సీజన్లో దారుణంగా నిరాశపరిచాడు. ఇక ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగించాడు. పైకి గాయం అని చెబుతున్నప్పటికీ.. ఫామ్ లేకపోవడం వల్ల అతని దూరం పెట్టారు. మ్యాక్స్ వెల్ భీకరమైన బ్యాటర్ అయినప్పటికీ.. కేవలం 48 పరుగులు మాత్రమే చేశాడు.
మెక్ గుర్క్ మీద ఢిల్లీ క్యాపిటల్స్ భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ అతడు వాటిని అందుకోలేక విఫలమయ్యాడు. ఇప్పటివరకు అతడు కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. గత సీజన్లో అతడు అద్భుతంగా ఆడినప్పటికీ.. ఈ సీజన్లో మాత్రం చేతులెత్తేశాడు.
ఇక చెన్నై జట్టు తరుపున రచిన్ రవీంద్ర ఓపనర్ గా బరిలోకి దిగేవాడు. అతడు అంతకుముందు మ్యాచ్ లలో బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు.. కానీ చెన్నై జట్టులో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. పరుగులు తీయడంలో విఫలమయ్యాడు. కేవలం 191 రన్స్ మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు.
షమీ, రిషబ్ పంత్, మాక్స్ వెల్, మెక్ గుర్క్, రచిన్ రవీంద్ర దారుణంగా ఫలమైన నేపథ్యంలో.. వీరికి వచ్చే సీజన్లో అవకాశం ఉండకపోవచ్చు అని తెలుస్తోంది. ఎందుకంటే వీరి మీద ఆయా జట్ల యాజమాన్యాలు భారీగా ఖర్చుపెట్టాయి. అయితే వాటిని అందుకోవడంలో వీరు విఫలమయ్యారు. అందువల్లే వచ్చే సీజన్లో కొనసాగించే అవకాశం ఉండకపోవచ్చు అని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.