IPL 2025 Foreign Players: వాస్తవానికి పహల్గాం ఘటన జరగకుండా ఉండి ఉంటే ఈ సమయం వరకు ఐపీఎల్ ముగింపు దశకు వచ్చేది. అనుకోకుండా జరిగిన ఆ ఘటన వల్ల.. పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఆ తర్వాత ఉగ్రవాద దేశంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. టెర్రరిస్టులను, టెర్రరిస్ట్ క్యాంపులను నేల కూల్చడానికి మన ఆర్మీ ఆపరేషన్ సిందూర్ చేపట్టాల్సి వచ్చింది. మొత్తంగా ఈ ఘటనతో బార్డర్ ఏరియాలలో టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. దీంతో చాలావరకు బార్డర్ ఏరియాలలో ఎయిర్ పోర్ట్ లను సెంట్రల్ గవర్నమెంట్ టెంపరరీగా షట్ డౌన్ చేసింది.
Also Read: రోహిత్ కెరియర్ అలా ముగియకూడదు.. ఒకవేళ నేను బీజీటీ కోచ్ అయితే: రవి శాస్త్రి!
ప్లేయర్ల లిస్ట్ ఇదే
ఐపీఎల్ లో ఫారిన్ ప్లేయర్లు కచ్చితంగా ఆడతారు. అయితే ఇటీవల నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా ప్లేయర్లు వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ముందస్తుగా డిసైడ్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారం ప్లేయర్లు ఐపీఎల్ ఆడేందుకు వచ్చారు. అనుకోకుండా ఐపిఎల్ టెంపరరీగా ఆగిపోవడంతో ఒక్కసారిగా ఫారిన్ ప్లేయర్ల షెడ్యూల్ తారు మారయింది. ఫలితంగా బీసీసీ పెద్దలకు ఇబ్బందికర వాతావరణ ఏర్పడింది. ఫ్రాంచైజీలకు కొంతమంది ప్లేయర్లు హ్యాండ్ ఇచ్చారు. ఇక మిగతా ప్లేయర్లు రావడానికి ఆసక్తి చూపి.. చివరికి వచ్చేసారు. మరికొద్ది గంటల్లో ఐపిఎల్ రీస్టార్ట్ అవుతున్న నేపథ్యంలో.. పది జట్లకు సంబంధించి వచ్చే ప్లేయర్లు.. వెళ్లిపోయిన ప్లేయర్ల జాబితా ఎలా ఉందో ఒకసారి పరిశీలిస్తే..
పంజాబ్
మిచెల్ ఓవెన్, ఓమర్ జాయ్, యాన్ సెన్(లీగ్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాడు), లాకీ ఫెర్గు సన్ (గాయం వల్ల దూరమయ్యాడు). స్థానంలో కైల్ జెమిసన్ ఆడతాడు.
గుజరాత్
బట్లర్ (లీగ్ ఎండింగ్ వరకే ఉంటాడు) ఇతడి ప్లేసులో కుశాల్ మెండిస్ ఆడతాడు. రూథర్ ఫోర్డ్, రబాడా(లీగ్ వరకే జట్టులో ఉంటారు) రషీద్ ఖాన్, శనక, కోయేట్జీ, జన్నత్, కరీమ్ ఆడతారు.
బెంగళూరు
రోమారియో షెఫర్డ్, ఫిల్ సాల్ట్, జాకబ్ బెతెల్(రెండు లీగ్ మ్యాచ్లు మాత్రమే ఆడతాడు) టీమ్ డేవిడ్, లివింగ్టన్, ఎంగిడి (లీగ్ వరకే అందుబాటులో ఉంటారు), నువాన్ తుశారా, జోష్ హే జిల్ వుడ్ జట్టులోకి వచ్చారు.
ముంబై
రికెల్టెన్, విల్ జాక్స్ లీగ్ దశ వరకే అందుబాటులో ఉంటారు. వీరి స్థానాలలో జానీ బెయిర్స్టా, రిచర్డ్ గ్లీసన్, జాకబ్స్ ఆడతారు. కార్బన్ బోష్(లీగ్ వరకు అందుబాటులో ఉంటారు) స్టబ్స్(లీగ్ వరకే), స్టార్క్, జేక్ ప్రెజర్, ఫెరీరా ఆల్రెడీ జట్టుకు దూరమయ్యారు.
కోల్ కతా
సునీల్ నరైన్, రస్సెల్, స్పెన్సర్ జాన్సన్, గుర్బాజ్, నోకియా, డికాక్ జట్టుకు అందుబాటులో ఉంటారు. మొయిన్ అలీ, రోవ్ మాన్ పావెల్ జట్టులో అందుబాటులోకి ఉండే అవకాశం లేదు.
లక్నో
మర్క్రామ్(లీగ్ వరకే అందుబాటులో ఉంటాడు) మిచెల్ మార్ష్, పూరన్, మాథ్యూ బ్రిడ్జ్ కే, విలియం ఓరూర్క్ (మాయాగ్ యాదవ్ ప్లేసులో), డేవిడ్ మిల్లర్ అందుబాటులో ఉన్నారు. అయితే సమర్ జోసెఫ్ మాత్రం ఆడే అవకాశం లేదు.
సన్ రైజర్స్ హైదరాబాద్
కమిన్స్, హెడ్, క్లాసేన్, కుమింద్ మెండిస్, ఇషాన్ మలింగ ఆడుతున్నారు. ముల్టర్ ఆడే అవకాశం లేదు.
రాజస్థాన్
హిట్ మేయర్, లువన్ డ్రైవ్ ప్రొటోరియస్, ఫారుకి, వావిందు హసరంగ, ముపాక, తీక్షణ ఆడుతున్నారు. జోఫ్రా ఆర్చర్, బర్జర్ జట్టుకు దూరంగా జరిగారు..
చెన్నై
నూర్ అహ్మద్, పతిరన, కాన్వే, బ్రేవిస్ ఆడుతున్నారు. జెమీ ఓవర్టెన్, సామ్ కరణ్, రచిన్ రవీంద్ర, నాథన్ ఎల్లీస్ ఆడటం లేదు.