Gas Cylinder : ఈ క్రమంలో కొంతమందికి దీపం పథకం కింద డబ్బులు అందడంలో ఆలస్యం జరిగింది. సాంకేతిక సమస్యలు అలాగే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోవడం, ఆధార్ లింకు చేయకపోవడం వంటి అనేక కారణాల వలన కొంతమందికి ఈ డబ్బులు అందలేదని అధికారులు చెప్తున్నారు. అయితే త్వరలోనే డబ్బులు అందని వాళ్లకి డబ్బులు జమ చేస్తామని వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా దీపం పథకం కింద ప్రజలకు ఏడాదికి సరిపడా డబ్బులను ఒకేసారి ఎకౌంట్లో చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు దీపం 2 పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తుంది. ఇప్పటికే లబ్ధిదారుల అకౌంట్లో మొదటి గ్యాస్ సిలిండర్ కు చెందిన డబ్బును జమ చేశారు. ఇక త్వరలో రెండో సిలిండర్ కు చెందిన డబ్బులను కూడా ప్రభుత్వం జమ చేస్తున్నట్లు సమాచారం. కొంతమంది తమకు రెండో విడత ఉచిత గ్యాస్ రాయితీ డబ్బులు రాలేదని ఫిర్యాదు కూడా చేశారు. వీళ్ళందరూ మొదటి విడతలో డబ్బులు త్వరగా అకౌంట్ లో పడ్డాయని కానీ రెండో విడతలో మాత్రం ఇప్పటివరకు రాలేదని తెలిపారు. కొన్ని సాంకేతిక సమస్యల వలన రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ రాయితీ కి సంబంధించి నిధులు విడుదల చేయడంలో ఆలస్యం జరిగిందని కానీ త్వరలోనే ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తామని అధికారులు తెలిపారు. మొదటి విడతలో అకౌంట్ లో డబ్బులు పొందిన వారందరికీ కూడా రెండో విడతలో కూడా డబ్బులు వస్తాయని అధికారులు చెప్తున్నారు.
Also Read : రెండో ఫ్రీ గ్యాస్ సిలిండర్.. బుకింగ్ అప్పటి నుంచి..!
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న దీపం పథకం గ్యాస్ సిలిండర్ల రాయితీకి సంబంధించి కొంతమంది రేషన్ కార్డు వివరాలను ఆన్లైన్లో చెక్ చేసుకున్న సమయంలో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలం ఉన్న ఇల్లు కలిగి ఉన్న వారికి, అలాగే కరెంట్ బిల్లు 300 యూనిట్ల కంటే ఎక్కువ వచ్చిన వారికి ఈ రాయితీకి అనర్హులు అని తేలిందట. అలాగే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోవడం వలన కూడా మరి కొంతమందికి డబ్బులు రాలేదని చెప్తున్నారు. అధికారులు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి తమ గ్యాస్ డీలర్ను సంప్రదించాలని సూచిస్తున్నారు. కొన్ని సాంకేతిక కారణాల వలన ఇప్పటివరకు నిధులు జమ కాలేదని కానీ వారం రోజుల వ్యవధిలోనే వాళ్లందరి బ్యాంకు ఖాతాలో నిధులు జమ చేయబడతాయి అని అధికారులు చెప్తున్నారు.