Homeక్రీడలుక్రికెట్‌IPL 2025: మండే ఎండల్లో.. మస్తు క్రికెట్ మజా..

IPL 2025: మండే ఎండల్లో.. మస్తు క్రికెట్ మజా..

IPL 2025: ఇటీవల టీం ఇండియా ఛాంపియన్స్ గెలుచుకుంది . ఆ ఆనందం అలా ఉండగానే మరో సంబరాన్ని అభిమానుల ముందుకు తేవడానికి క్రికెటర్లు రెడీ అయ్యారు. క్రికెట్ అభిమానులకు మరింత హుషారు ఇస్తూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ వచ్చేసింది. శనివారం కోల్ కతా లోనిఈడెన్ గార్డెన్స్ వేదికగా ఐపీఎల్ 18వ సీజన్ మొదలవుతుంది. తొలి మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్ కోల్ కతా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు (KKR vs RCB) పోటీ పడతాయి.

Also Read: అతడి మరణ మాస్ ఇన్నింగ్స్..SRH 300 చేయడం గ్యారెంటీ!

కెప్టెన్లు మారారు

ఈసారి ఐపీఎల్ సరికొత్తగా ముస్తాబై వచ్చింది. గత ఏడాది మెగా వేలం జరగగా.. భారీ ధరకు స్టార్ ఆటగాళ్లను జట్ల యాజమాన్యాలు కొనుగోలు చేశాయి. కొందరు కెప్టెన్లు పాత జట్లకు గుడ్ బై చెప్పేశారు.. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టిన టీమిండి ఆటగాళ్లు.. ఇప్పుడు విడివిడిగా పోటీ పడతారు. అయినప్పటికీ చివరి బంతి వరకు.. ఉత్కంఠగా సాగే ప్రతి మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అదిరిపోయే ఆనందాన్ని అందిస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మార్చి 22న మొదలయ్యే ఐపీఎల్ 18వ సీజన్ మే 25 న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది.. మొత్తంగా పది చెట్లు 74 మ్యాచులు ఆడతాయి.. శనివారం నాడు కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీ పడతాయి.. అయితే ఈసారి ఆయా జట్లలో కొత్త కొత్త ఆటగాళ్లు కనిపిస్తున్నారు. ఇక ఈ సీజన్లో బంతికి ఉమ్మి రాయడంపై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది. దీంతో పేస్ బౌలర్లు ప్రభావం చూపించే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మంచు ప్రభావాన్ని కూడా ఎదుర్కోవడానికి అంపైర్ల అంగీకారంతో బౌలర్లు బంతిని మార్చే వెసలుబాటు కూడా ఉంది. ఎత్తుగా ఏసే వైడ్లు, ఆఫ్ స్టంపు అవతల వేసే వైడ్లను నిర్ధారించడానికి డీఆర్ఎస్ విధానాన్ని వినియోగిస్తారు. ఇవన్నీ కూడా మ్యాచ్లను అత్యంత రసవత్తరంగా మార్చనున్నాయి.

వర్షం అంతరాయం కలిగిస్తుందా..

ఐపీఎల్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఆనందంపై వరుణదేవుడు నీళ్లు చల్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే కోల్ కతా రీజియన్ పరిధిలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. శనివారం కోల్ కతా, బెంగళూరు జట్ల మధ్య జరిగే ప్రారంభ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది. శుక్రవారం రెండు జట్లు ప్రాక్టీస్ సెషన్ ను విజయవంతంగా పూర్తి చేశాయి. వర్షం వల్ల శనివారం సాయంత్రం జరిగే ప్రారంభ వేడుకలు కూడా ప్రభావితం అవుతాయని తెలుస్తోంది.. ఇక లీగ్ దశలో మ్యాచ్ ల నిర్వహణకు ఒక గంట పాటు సమయం అదనంగా కేటాయిస్తారు. దీంతో 5 ఓవర్ల మ్యాచ్ అర్ధరాత్రి 12 గంటల లోపే పూర్తి కావాలి. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ గనుక రద్దు అయితే రెండు జట్లకు చెరొక పాయింట్ కేటాయిస్తారు.

 

Also Read: యజువేంద్ర చాహల్ – ధనశ్రీ.. ఇక అధికారికం

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular