IPL అనేది రొటీన్ క్రికెట్ మ్యాచ్ కాదు. రొటీన్ క్రికెట్ టోర్నీ అంతకంటే కాదు. వేలాది కోట్లు.. వందల కొద్దీ కంపెనీలు.. పదులకొద్దీ మ్యాచులు.. దేశాలకొద్దీ ఆటగాళ్లు.. ఇలా రోజులపాటు ఈ క్రికెట్ పండుగ జరుగుతుంది. అలాంటప్పుడు ఈ టోర్నీ ప్రారంభం ఎలా ఉండాలి.. వేడుకలు ఎలా జరపాలి.. అంబరాన్ని అంటాలి. ప్రేక్షకులు సమ్మోహనులు కావాలి. ఆటతో, పాటతో, మాటతో వారిని నిర్వాహకులు అలరించాలి. ఆట, పాట పక్కన పెడితే.. మాట విషయానికి వచ్చేసరికి ఐపీఎల్ 17వ సీజన్లో తేడా కొట్టింది. దీంతో ఐపీఎల్ అభిమానులకు కోపం తారాస్థాయికి చేరుతోంది. వారి ఆగ్రహం సోషల్ మీడియాలో ప్రతిబింస్తోంది.
వాస్తవానికి ఐపీఎల్ ప్రారంభ వేడుకలు నిన్న సాయంత్రం 6:30 నిమిషాలకు ప్రారంభమయ్యాయి. ఏకధాటిగా గంటపాటు సాగాయి. ఏఆర్ రెహమాన్, సోనూ నిగమ్ వంటి వారు తమ పాటలతో అలరించారు. ఏ ఆర్ రెహమాన్ దేశభక్తి గేయాలు, ఇతర స్ఫూర్తి నింపే పాటలు పాడి అభిమానులను అలరించారు. సోనూ నిగమ్ కూడా అంతే.. ఇక అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తమ డ్యాన్సులతో అభిమానులను అలరించారు. కన్నుల పండువగా జరిగిన ఈ వేడుకల్లో యాంకర్ పరమ బోరింగ్ గా వ్యవహరించింది.. తన మాట తీరు ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..”ఈమెను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు..ఇది ఐపీఎల్ భయ్యా.. శ్రీదేవి డ్రామా కంపెనీ కాదు” అనే రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు.
ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు షెఫాలీ బగ్గా యాంకర్ గా వ్యవహరించింది. అయితే ఆ మాట తీరు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు. “ఎవరు ఈమె యాంకరా? ఆమె మాట తీరు ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదు” అంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టారు.” ఆమె యాంకరింగ్ తో నా రెండు చెవులకు చిల్లులు పడ్డాయి. అత్యంత నాసిరకంగా ఆమె యాంకరింగ్ ఉంది. పరమ చెత్త యాంకర్.. అసలు ఈమెకు ఎందుకు అవకాశం ఇచ్చారు” అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. దీంతో బగ్గా పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. బగ్గా గురించి ఆరా తీస్తే.. ఆమె గతంలో యాంకర్ గా పనిచేస్తుంది.. జర్నలిస్ట్ కూడా.. 1994 జూలై 1న ఢిల్లీలో జన్మించింది. న్యూస్ ప్రజెంటర్ గా ఆమె తన వృత్తి గత జీవితాన్ని మొదలుపెట్టింది. ఐపీఎల్ కు ఇదే మొదటిసారి ఆమె యాంకర్ గా పనిచేయడం. ఇటీవల శ్రీలంకలో జరిగిన లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీకి ఆమె యాంకర్ గా పనిచేసింది. హిందీ బిగ్ బాస్ రియాల్టీ షో 2019 సీజన్లో ఒక కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది.
Horrible anchor for the #IPL2024 inauguration on @StarSportsIndia ♂️♂️
— Thusi (@thusi_c) March 22, 2024
Hosted the grand opening ceremony of Legends cricket trophy in Sri Lanka pic.twitter.com/FTTBEXW7Y5
— Shefali Bagga (@shefali_bagga) March 9, 2024