IPL 2024 SRH vs KKR : ఐపీఎల్ 17వ సీజన్ లో ఇప్పటివరకు రెండు మ్యాచ్ లు ముగిసాయి. రెండు మ్యాచ్లోనూ నూట డెబ్బై పైచిలుకు స్కోర్లు మాత్రమే నమోదయ్యాయి. కానీ తొలిసారిగా శనివారం సాయంత్రం కోల్ కతా, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 200 పైచిలుకు స్కోర్ నమోదయింది. ఆకాశమే హద్దుగా బ్యాటర్లు చెలరేగిపోవడంతో బౌలర్లు మౌన ప్రేక్షకులుగా చూస్తుండిపోయారు. ఫోర్లు, సిక్స్ లు మంచినీళ్ల ప్రాయంలాగా కొట్టడంతో ప్రేక్షకులు కేరింతలు కొట్టారు
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా జట్టుతో హైదరాబాద్ జట్టు తలపడింది. టాస్ గెలిచినప్పటికీ హైదరాబాద్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. 51 పరుగులకే నాలుగు వికెట్లు తీసింది. ఇక కోల్ కతా 150 లోపు చాప చుట్టేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ వారందరి అంచనాలను రమన్ దీప్ సింగ్ (35, 17 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు), సాల్ట్(54, 40 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) అరి వీర భయంకరంగా ఆడారు. ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. ఐదో వికెట్ కు 54 పరుగులు జోడించారు. దీంతో కోల్ కతా జట్టు సురక్షిత స్థానానికి చేరుకుంది. జట్టు స్కోరు 105 పరుగుల వద్ద రమన్ దీప్ సింగ్ అవుట్ అయ్యాడు. ఈలోపు ఫిలిప్ సాల్ట్ (54) కూడా మయాంక్ మార్కండే బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు..
సాల్ట్ ఔట్ అయ్యే నాటికి కోల్ కతా జట్టు స్కోరు 119 పరుగులు. ఇక అప్పుడు మొదలైంది రస్సెల్ విధ్వంసం. ప్రతి బంతిని బలంగా బాదాడు. బౌలర్ ఎవరనేది చూడలేదు. ధాటిగా బ్యాటింగ్ చేయడంతో బంతులు గాల్లో తేలాయి. 25 బంతుల్లో మూడు ఫోర్లు, 7 సిక్స్ ల సహాయంతో రస్సెల్ 64 పరుగులు చేశాడు. ఫలితంగా కోల్ కతా జట్టు స్కోరు 208 పరుగులకు చేరుకుంది. ఏడో వికెట్ కు రింకు సింగ్, రస్సెల్ దాదాపు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 3, మయాంక్ మార్కండే రెండు, కమిన్స్ ఒక వికెట్ తీశారు.