RCB Vs PBKS 2024: ఐపీఎల్ సీజన్ 17 లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో బెంగుళూర్ టీమ్ భారీ విజయాన్ని సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో తొలిత బ్యాటింగ్ కి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. పంజాబ్ కెప్టెన్ అయిన శిఖర్ ధావన్ 45 పరుగులు, జితేష్ శర్మ 27 పరుగులు చేసి టీం ని ఆదుకోవడం ద్వారా పంజాబ్ కింగ్స్ గౌరవప్రదమైన స్కోర్ అయితే చేయగలిగింది.
ఆర్సిబి బౌలర్లలో సిరాజ్, గ్లెన్ మాక్స్ వెల్ అద్భుతమైన బౌలింగ్ చేసి చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సిబి మొదటి ఓవర్ లోనే కింగ్ కోహ్లీ జీరో పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ కీపర్ బెయిర్ స్ట్రో క్యాచ్ డ్రాప్ చేశాడు. అదే ఓవర్ లో కోహ్లీ నాలుగు బౌండరీలు బాదాడు. ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో 49 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు. చివరి 4 ఓవర్లలో 48 పరుగులు చేయాల్సి ఉండగా అప్పుడే క్రీజ్ లోకి వచ్చిన దినేష్ కార్తీక్ 10 బంతుల్లో రెండు సిక్స్ లు, మూడు బౌండరీలతో 28 పరుగులు చేసి జట్టుకు విజయనందించాడు.
ఈ మ్యాచ్ లో అద్భుతంగా రానిచ్చిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో ‘కగిసో రబాడ’ ఆదిలోనే డూప్లెసిస్, గ్రీన్ లాంటి ఇద్దరి కీలకమైన వికెట్లు తీసి ఆర్సిబి ని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఇక చివరిదాకా ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్ లో ఆర్సిబి ఘన విజయం సాధించి ఈ ఐపీఎల్ సీజన్ లో రెండోవ మ్యాచ్ లో బోణి కొట్టడం అనేది ఒక శుభపరిణామం అనే చెప్పాలి.
ఇక మొత్తానికైతే బెంగుళూర్ ప్లేయర్లలో కోహ్లీ, దినేష్ కార్తీక్ లాంటి ప్లేయర్లు మంచి ఫామ్ లో ఉండటం ఈ టీమ్ కి బాగా కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి.ఇక ఈ డబ్ల్యుపీఎల్ సీజన్ లో ఆర్సిబి ఛాంపియన్ గా నిలవడం కూడా ఈ టీమ్ లో మంచి జోష్ ను నింపిందనే చెప్పాలి…ఇక ఇదే జోరు ను కొనసాగిస్తే బెంగుళూరు ఈసారి కప్పు కొట్టడం పక్కా…