IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ చెన్నై, బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఎందుకు సంబంధించి బిసిసిఐ ఏర్పాట్లు చేసింది. టికెట్ల విక్రయాలు కూడా మొదలు పెట్టింది. ఇదంతా ఒక ఎత్తైతే.. ముంబై ఫ్యాన్స్ ముఖ్యంగా రోహిత్ అభిమానుల బాధ మరో విధంగా ఉంది. ఇప్పటికే ముంబై ట్రైనింగ్ క్యాంప్ లోకి రోహిత్ శర్మ అడుగుపెట్టాడు. రోహిత్ రాకను పురస్కరించుకొని ముంబై యాజమాన్యం ట్విట్టర్ ఎక్స్ లో ఒక వీడియో పెట్టింది. దీనిపై రోహిత్ అభిమానులు ముంబై యాజమాన్యాన్ని ఏకిపారేస్తున్నారు. ఎందుకు రోహిత్ ను కెప్టెన్ గా తప్పించారని ప్రశ్నిస్తున్నారు.. అంతకుముందు ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, హెడ్ కోచ్ మార్క్ బౌచర్ తో కలిసి విలేకరులతో మాట్లాడాడు. తను కెప్టెన్ అయిన దగ్గర నుంచి రోహిత్ శర్మతో మాట్లాడేందుకు సమయమే కుదరలేదని అన్నాడు. అసలే మంట మీద ఉన్న రోహిత్ అభిమానులకు హార్దిక్ పాండ్యా చేసిన వ్యాఖ్యలు మరింత కాకను పుట్టించాయి. దీంతో వారు ఆగ్రహంతో “రి* హార్దిక్ పాండ్యా” అంటూ సోషల్ మీడియాలో యాష్ ట్యాగ్ ను సర్క్యూలేట్ చేస్తున్నారు.
వాస్తవానికి రోహిత్ శర్మ ఆధ్వర్యంలో ముంబై జట్టు ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. 2023 వరకు ముంబై మీదే అత్యధిక ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టుగా రికార్డు ఉండేది. గత ఏడాది చెన్నై ఐపీఎల్ టైటిల్ గెలవడంతో ముంబై రికార్డు సమమైంది. అయితే ముంబై ని విజయవంతమైన జట్టుగా మలిచిన రోహిత్ శర్మను కెప్టెన్ గా తొలగించి.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను ముంబై యాజమాన్యం నియమించింది. పైగా ఈ నిర్ణయాన్ని మార్క్ బౌచర్.. యాజమాన్య నిర్ణయమని ప్రకటించాడు. దీనిపై అప్పట్లో రోహిత్ శర్మ భార్య రితిక స్పందించింది. మార్క్ బౌచర్ చెబుతోంది మొత్తం అబద్ధమని, తన భర్త పై కుట్రలు చేస్తున్నారని ఆరోపించింది. దీంతో రోహిత్ అభిమానులు రెచ్చిపోయారు. ముంబై జట్టుకు వ్యతిరేకంగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.. ఒకానొక దశలో తాను ఐపీఎల్ ఆడబోనని రోహిత్ శర్మ ప్రకటించాడు. తర్వాత ఆ ట్వీట్ డిలీట్ చేశాడు.
హార్దిక్ పాండ్యా ను కెప్టెన్ గా నియమించడం పట్ల రోహిత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ముంబై జట్టు యాజమాన్యాన్ని, హార్దిక్ పాండ్యాను ఏకి పారేస్తున్నారు. “ముంబై జట్టుకు ఎన్నో విజయాలు సాధించిన రోహిత్ ను కెప్టెన్ గా ఎందుకు పక్కన పెట్టారని” ప్రశ్నిస్తున్నారు.. రి* హార్దిక్ పాండ్యా అంటూ యాష్ ట్యాగ్ ను సర్క్యూలేట్ చేస్తున్నారు. రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చూస్తుంటే.. ఒకవేళ వారు వ్యతిరేకిస్తున్న ఆటగాడు కనిపిస్తే కొట్టేలా ఉన్నారు. మరి ఈ అభిమానుల ఆగ్రహాన్ని ఎవరు చల్లార్చుతారో వేచి చూడాల్సి ఉంది.
No #RohitSharma fans will pass without liking this post ❤️
RIP HARDIK PANDYA
#ElvishAmry
pic.twitter.com/jB0Sm8Q36U— फ़ितूर (@cricket_adda_) March 19, 2024