Riyan Parag: “ఐపీఎల్ లో మిగతా ఆటగాళ్లు మొత్తం ఒక ఎత్తు అయితే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు మరొక ఎత్తు.. ప్రతిదానికి ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. అందుకే అతను ఆటకంటే ఓవర్ యాక్షన్ స్టార్ గా ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు.. ఆ ఓవర్ యాక్టింగ్ వల్ల కొన్ని కొన్ని సార్లు దారుణంగా అవుట్ అయ్యాడు” రియాన్ పరాగ్ గురించి సోషల్ మీడియాలో వినిపించిన విమర్శలు. ఆ విమర్శల వల్ల ఎంత నొచ్చుకున్నాడో తెలియదు కానీ.. తనను గేలి చేసిన వారితోనే మెచ్చుకునేలా చేసాడు పరాగ్. ఐపీఎల్ ఎన్ని సీజన్లో ఎన్నడూ అతడు భారీ ఇన్నింగ్స్ ఆడింది లేదు. ఒకవేళ సిక్స్ కొట్టినా, క్యాచ్ పట్టినా బిల్డప్ బాబాయ్ లాగా బిల్డప్ ఇస్తుంటాడు. మైదానంలో అతడు చేస్తున్న చేష్టలు చూసి ఓవర్ యాక్షన్ స్టార్ అని అభిమానులు పేరు పెట్టారు. ఆట తక్కువ.. ఫోజులు ఎక్కువ అంటూ విమర్శలు చేసేవారు. అయితే అలాంటి పరాజు ఒక్కసారిగా తన ఆట తీరులో మార్పు చూపించాడు. నేను ఓవర్ యాక్షన్ స్టార్ కాదు.. అద్భుతమైన ఆటగాడిని అని నిరూపించుకున్నాడు.
ఈ ఏడాది డొమెస్టిక్ క్రికెట్లో దుమ్మురేపాడు. చెలరేగి బ్యాటింగ్ చేశాడు. ఐపీఎల్ లో కూడా అదే స్థాయిలో సత్తా చాటుతాడని అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఐపీఎల్లో అతడు రాణిస్తున్నాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్లో 29 బంతుల్లో 43 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇక గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన రెండవ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 34 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. మొత్తంగా 45 బంతులు ఎదుర్కొన్న ఇతడు 84 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఏడు ఫోర్లు, ఆరు భారీ సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు. రియాన్ పరాగ్ ఢిల్లీ జట్టు మీద చేసిన 84 పరుగులే తన ఐపీఎల్లో అత్యధిక స్కోరు. ముఖ్యంగా ఢిల్లీ పేస్ బౌలర్ నార్త్ జే వేసిన చివరి ఓవర్ లో సునామీ సృష్టించాడు. ఏకంగా 25 పరుగులు పిండుకున్నాడు. ఇందులో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. నాలుగు వికెట్లకు 90 పరుగులు మాత్రమే చేసి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాజస్థాన్ జట్టు భారాన్ని పరాగ్ మొత్తం మోశాడు. 20 ఓవర్లు ముగిసే నాటికి 185 పరుగుల వరకు తీసుకొచ్చాడు. పరాగ్ ఆడిన సూపర్ ఇన్నింగ్సే ఇందుకు కారణం.
పరాగ్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో సోషల్ మీడియాలో అతడి పేరు మారుమోగిపోతోంది. అభిమానులు అతడిని సూపర్ స్టార్ అని కొనియాడుతున్నారు. రాజస్థాన్ జట్టుకు కష్ట కాలంలో లభించిన ఆపద్బాంధవుడని కీర్తిస్తున్నారు. “దేశవాళీ క్రికెట్లో గత ఏడాది అతడు అద్భుతంగా ఆడాడు. ఈ ఏడాది కూడా మెరుపులు మెరిపించాడు. ఐపీఎల్ లో అద్భుతాలే చేస్తాడనుకున్నాం. ఆ దిశగానే ఆడుతున్నాడు. ఢిల్లీ జట్టుపై రాజస్థాన్ విజయం సాధించిందంటే దానికి కారణం పరాగ్ ఆడిన ఇన్నింగ్సే” అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
A ⭐ is born! Riyan Parag, take a bow! #RiyanParag #RRvDC #TATAIPL #IPL2024 #BharatArmypic.twitter.com/w7aDkCPMNE
— The Bharat Army (@thebharatarmy) March 28, 2024