IPL 2024 New Rule: 2024 ఐపిఎల్ కోసం ఈరోజు మినీ ఆక్షన్ నిర్వహిస్తున్నారు. దుబాయ్ వేదికగా జరిగే ఈ ఆక్షన్ లో 333 మంది ప్లేయర్లు పాల్గొనబోతున్నారు. ఇక ఇందులో 214 మంది భారతదేశానికి చెందిన ప్లేయర్లు కాగా, 119 మంది విదేశీ ప్లేయర్లుగా ఉన్నారు. ఇక అందులో క్యాప్డ్ ప్లేయర్స్ 116 మంది ఉంటే, అన్ క్యాప్డ్ ప్లేయర్స్ 215 మంది ఉన్నారు.
ఇక ఇందులో బాగానే 2024 ఐపిఎల్ కి సంబంధించి కొత్త నిబంధనలను కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ కొత్త నిబంధన బౌలర్లకు కొంతమేరకు ఊరట కలిగించే విధంగా కనిపిస్తుంది. ఇక అదే విధంగా బ్యాట్స్ మెన్ ల దూకుడుకు కళ్లెం వేసే విధంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి బ్యాట్స్ మెన్ బౌలర్లను దాటి గా ఎదుర్కొంటూ వాళ్ళ మీద విరుచుకుపడుతూ ఆడుతున్నారు.ఇక ఈ క్రమంలో బౌలర్లు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు.దానివల్ల ధారాళంగా పరుగులు సమర్పించుకోవాల్సి వస్తుంది. ఇక దానికి ఊరట కలిగించడానికి ఈసారి ఐపీఎల్ లో సరి కొత్త రూల్ ని ప్రవేశపెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. అదేంటంటే ప్రతి ఓవర్ కి రెండు బౌన్సర్లను వేసుకోవడానికి బౌలర్లకు అనుమతిని ఇచ్చారు. ఇక ఇంతకుముందు ఒక బౌన్సర్ వేసి రెండో బౌన్సర్ వేయగానే ఎంపైర్ దానిని వైడ్ గా పరిగణించేవాడు కానీ ఇప్పుడు రెండు బౌన్సర్లకి అనుమతి ఉండటం తో బౌలర్లు మరింత రెచ్చిపోయి బౌలింగ్ చేసే అవకాశం అయితే ఉంది…
ఇక ఈ రూల్ ను అమల్లోకి తేవడం మీద ఇండియన్ బౌలర్ అయిన జయదేవ్ ఉనద్ కట్ స్పందిస్తూ ఓవర్ కి రెండు బౌన్సర్లు అనేవి బౌలర్లకు ఒకరకంగా వరం అనే చెప్పాలి. ఒకానొక సమయంలో బ్యాట్స్ మెన్స్ భారీ రన్స్ కొడుతున్నప్పుడు బౌలర్లు ఏమి చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి సమయంలో ఈ బౌన్సర్లను చాలా బాగా వాడుకోవచ్చు అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఒక బ్యాట్స్ మెన్ క్రీజ్ లో స్టాండ్ అయి భారీ గా షాట్లు కొడుతున్నప్పుడు బౌలర్లు ఏమీ చేయలేక పేలవమైన పర్ఫామెన్స్ ఇస్తూ ఆ బ్యాట్స్ మెన్ వికెట్ తీయడంలో చాలా వరకు ఫెయిల్ అవుతుంటారు.అలాగే ధారాళంగా పరుగులను కూడా ఇస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో ఈ బౌన్సర్లనేవి చాలా బాగా యూజ్ అవుతాయి అంటూ తనదైన రీతిలో స్పందించాడు…
ఇక 2023లో తీసుకొచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను కూడా అదే విధంగా కంటిన్యూ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ రూల్ అనేది మ్యాచ్ మొత్తాన్ని మార్చే విధంగా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అని కూడా చాలామంది ప్రముఖులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…