https://oktelugu.com/

Pallavi Prashanth: రతిక అడిగి మరీ ఆ పని చేయించుకుంది… బయటకు వచ్చాక బాంబు పేల్చిన రైతుబిడ్డ

ప్రశాంత్ బిగ్ బాస్ బజ్ లో మాట్లాడుతూ .. హోస్ట్ నాగార్జున నా చెయ్యి పైకి ఎత్తినప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోయాను. ఆ క్షణం తమాయించుకోవడం కష్టం అయిపోయింది.

Written By:
  • NARESH
  • , Updated On : December 19, 2023 / 11:21 AM IST

    Pallavi Prashanth

    Follow us on

    Pallavi Prashanth: బిగ్ బాస్ లో ఒక కామన్ మ్యాన్ కు అవకాశం దక్కడమే గొప్ప అనుకుంటే .. టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. అంత మంది సెలెబ్రేటిస్ మధ్యలో ఒక అనామకుడిగా ఇంట్లోకి ఎంటర్ అయిన ప్రశాంత్ తనను తాను నిరూపించుకున్నాడు. కోట్లాది ప్రజల మనసులను గెలుచుకుని విజేతగా నిలిచాడు.కాగా ప్రశాంత్ బిగ్ బాస్ బజ్ లో మాట్లాడుతూ .. హోస్ట్ నాగార్జున నా చెయ్యి పైకి ఎత్తినప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోయాను. ఆ క్షణం తమాయించుకోవడం కష్టం అయిపోయింది.

    అమ్మో నేనే గెలిచానా.. అని ఊహించుకోలేక పోయాను. నోట మాటలు రాలేదు. ఈ విజయం నాది కాదు, నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరిది అని ప్రశాంత్ అన్నాడు. నాతో క్లోజ్ గా ఉంటూనే రతిక నన్ను నామినేట్ చేయడం నాకు నచ్చలేదు. ఇంట్లో జరిగిన విషయాలు కాకుండా బయట పాయింట్స్ తీసుకొచ్చి నామినేట్ చేసింది. అప్పటి నుంచి దూరంగా ఉండటం మొదలుపెట్టాను. అయితే తనను అక్క ని పిలమని రతికానే అన్నది.

    అందుకే నేను అక్క అని పిలిచాను. ఒక్కసారి అక్క అంటే ఇక అక్కే అని ప్రశాంత్ వివరించాడు. రతికను అక్క అని పిలవడం మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ వద్దు అన్నది. నేను అక్క అనే పిలుస్తాను అన్నాను. రతికతో కొన్ని గొడవలు జరిగాయి. కానీ నేను వాటిని పట్టించుకోలేదు అని చెప్పాడు. రతిక అక్క అనవద్దని శివాజీతో రికమెండ్ చేయించిన విషయం తెలిసిందే.

    ప్రశాంత్ ఇంకా మాట్లాడుతూ… శివాజీ అన్న సప్పోర్ట్ లేకపోతే ఇంతటి విజయం దక్కేదో లేదో తెలియదు. కానీ ఆయన మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. భుజం తట్టి ప్రోత్సహించాడు. ఆయన భార్య నుంచి వచ్చిన లెటర్ ను త్యాగం చేశాడు. ఒక కామన్ మ్యాన్ గా వచ్చావు .. కప్పు కొట్టాలి అని చెప్పాడు. నా జీవితంలో ఎవరైనా త్యాగం చేశారు అంటే అది శివన్ననే. కామన్ మ్యాన్ పవర్ చూపించాలని అన్నప్పుడల్లా నాకు ధైర్యం వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ అమర్ ని ఓడించి బిగ్ బాస్ టైటిల్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే…