https://oktelugu.com/

IPL 2024 : ఇషాన్ కిషన్ మామూలోడు కాదు.. ఏకంగా ఆ క్రికెటర్ లాగా ఇమిటేట్.. వీడియో వైరల్

కాగా, రంజీ మ్యాచ్ లు ఆడకపోవడంతో బీసీసీఐ ఇషాన్ కిషన్ ను ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేయలేదు. దీంతోపాటు సెంట్రల్ కాంట్రాక్ట్ లో కూడా అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా కిషన్ డీలా పడిపోయాడు. బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు డీవై పాటిల్ కప్ ద్వారా టీ - 20 లోకి అడుగుపెట్టాడు.. అయినప్పటికీ ఆకట్టుకోలేకపోయాడు. త్వరలో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ముంబై జట్టు తరఫున ప్రాక్టీస్ సెషన్ లో మునిగిపోయాడు.

Written By:
  • NARESH
  • , Updated On : March 17, 2024 / 10:17 PM IST

    Mumbai Indians, Ishan Kishan, Malinga

    Follow us on

    IPL 2024 : బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో స్థానం దక్కించుకోలేకపోవడంతో ఇటీవల ఇషాన్ కిషన్ పేరు మీడియా, సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. అంతకుముందు అతడు తనకు మానసిక ఆరోగ్యం బాగోలేదని బీసీసీఐ నుంచి ప్రత్యేక విశ్రాంతి తీసుకున్నాడు. కానీ చికిత్స తీసుకోకుండా ధోని, రిషబ్ పంత్ తో కలిసి దుబాయిలో పార్టీలో కనిపించాడు. దీంతో అతడు బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లో స్థానం దక్కించుకోకపోవడంతో కిషన్ డివై పాటిల్ కప్ లో బరిలోకి దిగాడు. ఆశించినంత స్థాయిలో ఆడ లేకపోయాడు. అయితే సోషల్ మీడియాలో తన పేరు మార్మోగిపోయేందుకు కిషన్ మరో ఎత్తుగడకు తెర లేపాడు. దీంతో అతని పేరు మళ్లీ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలైంది. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..

    ఐపీఎల్ 17వ సీజన్ లో కిషన్ ముంబై జట్టుకు ఆడుతున్నాడు. త్వరలో లీగ్ మ్యాచ్ లు ప్రారంభ కానున్నాయి. తొలి మ్యాచ్ బెంగళూరు, చెన్నై మధ్య జరగనుంది. టి20 లీగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి. అందులో ముంబై జట్టు కూడా ఉంది. ఇషాన్ కిషన్ కు ఇమిటేట్ స్టార్ అనే బిరుదు ఉంది. గతంలో అతడు టీం ఇండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీని అనుకరించి హాస్యం పండించాడు. ఇప్పుడు తాజాగా శ్రీలంక మాజీ బౌలర్ మలింగను లిమిటెడ్ చేశాడు. ప్రాక్టీస్ శిబిరంలో ఒక ప్రత్యేకమైన విగ్గు ధరించి.. మలింగను ఇమిటేట్ చేశాడు. అదికూడా మలింగ ముందే.. దీంతో మలింగ నవ్వు ఆపుకోలేక పోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతున్నది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. “బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో స్థానం సంపాదించకపోయినప్పటికీ నువ్వు మారలేదయ్యా” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

    కాగా, రంజీ మ్యాచ్ లు ఆడకపోవడంతో బీసీసీఐ ఇషాన్ కిషన్ ను ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేయలేదు. దీంతోపాటు సెంట్రల్ కాంట్రాక్ట్ లో కూడా అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా కిషన్ డీలా పడిపోయాడు. బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు డీవై పాటిల్ కప్ ద్వారా టీ – 20 లోకి అడుగుపెట్టాడు.. అయినప్పటికీ ఆకట్టుకోలేకపోయాడు. త్వరలో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ముంబై జట్టు తరఫున ప్రాక్టీస్ సెషన్ లో మునిగిపోయాడు.