Anchor Varshini IPL 2023: నువ్వు రాకమ్మా యాంకర్ వర్షిణి.. సన్ రైజర్స్ సంక నాకిపోతోంది.!

సన్ రైజర్స్ జట్టు ఆడిన మ్యాచ్ లకు వర్షిణి హాజరైన ప్రతిసారి ఓటమిపాలైంది అని అభిమానులు గుర్తు చేస్తున్నారు. దయచేసి మ్యాచ్ కు మరోసారి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు అయితే 'వర్షిణి.. నీ ఐరన్ లెగ్ తో గెలిచే మ్యాచ్ ను ఒడించావ్ కదా ' అని ఘాటుగా విమర్శిస్తున్నారు.

Written By: BS, Updated On : May 5, 2023 2:47 pm

Anchor Varshini IPL 2023

Follow us on

Anchor Varshini IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా ఎడిషన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిరాశపరుస్తోంది. కోల్కతా నైట్ రైడర్స్ తో గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పేలవ బ్యాటింగ్ తో హైదరాబాద్ జట్టు ఐదు పరుగులు తేడాతో ఓటమి పాలైంది. చివరి ఆరు బంతుల్లో 9 పరుగులు చేయలేక ఓటమికి తలవంచింది. ఈ ఓటమి నేపథ్యంలో తెలుగు బుల్లితెర నటి వర్షిణిని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఆమె అడుగు ఐరన్ లెగ్ అంటూ విమర్శలు చేస్తున్నారు.

ఈ ఏడాది ఐపీఎల్ హైదరాబాద్ జట్టుకు కలిసి రావడం లేదు. సులభంగా గెలవాల్సిన మ్యాచుల్లో కూడా ఓటమిపాలై అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తోంది హైదరాబాద్ జట్టు. ఉప్పల్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్ వీక్షించేందుకు చాలామంది అభిమానులు, సెలబ్రిటీలు తరలివచ్చారు. వీరిలో యాంకర్ వర్షిణి కూడా ఉంది. హైదారాబాద్ జట్టుకు అండగా స్టేడియంలో కేరింతలు కొడుతూ మ్యాచ్ ను తెగ ఎంజాయ్ చేసింది ఈ అమ్మడు. మ్యాచ్ కు హాజరైన ఫోటోలను వర్షిణి ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగా అభిమానులు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. వర్షిణి వల్లే సునాయాసంగా గెలిచే మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు ఓడిపోయిందని పలువురు ఆరోపిస్తున్నారు.

వర్షిణి వచ్చిన ప్రతి మ్యాచ్ లోనూ ఓటమి..

సన్ రైజర్స్ జట్టు ఆడిన మ్యాచ్ లకు వర్షిణి హాజరైన ప్రతిసారి ఓటమిపాలైంది అని అభిమానులు గుర్తు చేస్తున్నారు. దయచేసి మ్యాచ్ కు మరోసారి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు అయితే ‘వర్షిణి.. నీ ఐరన్ లెగ్ తో గెలిచే మ్యాచ్ ను ఒడించావ్ కదా ‘ అని ఘాటుగా విమర్శిస్తున్నారు. ‘ నీకు దండం పెడతాం తల్లి దయచేసి మ్యాచ్ కు రావద్దు ‘ అని మరికొందరు కోరుతున్నారు. ముంబై ఇండియన్స్ తో ఉప్పల్ వేదికగా జరిగిన గత మ్యాచ్ లోనూ సన్ రైజర్స్ జట్టు ఓటమి పాలయింది. ఈ మ్యాచ్ కు కూడా వర్షిణి హాజరైంది. మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ తో సే
సెల్ఫీ దిగింది. ఈ ఫోటోను షేర్ చేయగా.. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో అభిమానులు వర్షిణిని ఒక ఆట ఆడుకున్నారు.

నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు అంటూ..

సూర్య కుమార్ యాదవ్ తో సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేసిన తరువాత అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ‘సూర్య కుమార్ పక్కన నువ్వేంటి..? అసలు నిన్ను ఎవరు రానిచ్చారు లోపలకి.’ అని కొందరు సెటైర్లు పేల్చితే.. సూర్య కుమార్ యాదవ్ ని బావా అని.. వర్షిణిని అక్కా అని వరసలు కలిపేస్తు హ్యపీ వెడ్డింగ్ యానివర్సరీ అక్కా.. బావో అని కామెంట్లు చేశారు. ‘సూర్య కుమార్ యాదవ్ కు పెళ్లి అయిపోయింది. వదిలేయ్ వర్షిణి అక్కో ‘ అని మరికొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు మరి కొందరు. ఇంకొంత మంది అయితే 360° బ్యాట్స్ మెన్ ను లైన్ లో పెట్టేసింది అని పలువురు విమర్శలు చేశారు. ఏది ఏమైనా హైదారాబాద్ జట్టు ఓటమిని వర్షిణికి లింక్ పెడుతూ చెడుగుడు ఆడుతున్నారు అభిమానులు.