Abdul Samad
Abdul Samad: ఈ ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు ఆట తీరు ఏమాత్రం మారడం లేదు. ఒక ఆటగాడు ఆడితే మరో ఆటగాడు ఆడడం లేదు. జట్టులో సమష్టితత్వం కొరవడడంతో వరుస ఓటములు చవి చూడాల్సి వస్తుంది. సొంత మైదానంలో ఆడుతున్నా.. భారీగా అభిమానులు మద్దతు ఉన్న హైదరాబాద్ జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోవడంతో ఓటమి తప్పడం లేదు. తాజాగా ముంబై తో జరిగిన మ్యాచ్ లో ఎవరూ మెరుగైన ప్రదర్శన చేయకపోవడంతో మరో ఓటమి మూట గట్టుకోవాల్సి వచ్చింది హైదరాబాద్ జట్టు. అయితే, ఈ మ్యాచ్ లో ఓ ఆటగాడి ఆట చూసి అభిమానులు ఇది ఎక్కడి ఆట రా బాబు అంటూ బుర్ర పగలగొట్టుకుంటున్నారు.
ముంబై తో మంగళవారం జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు 14 పరుగులు తేడాతో ఓడిపోయింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ జట్టు 178 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్ లో ముంబై బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. జోసన్ బెహ్రొండోర్ఫ్, మెరిడిత్, చావ్లా తలా రెండు వికెట్లు సాధించగా.. గ్రీన్, అర్జున్ టెండూల్కర్ ఒక్కో వికెట్ సాధించారు. హైదరాబాద్ జట్టులో మయాంక్ అగర్వాల్ 48 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే భారీ లక్ష్య సాధనకు దిగిన హైదరాబాద్ జట్టుకు ఆశించిన స్థాయిలో శుభారంభం లభించకపోవడంతో ఓటమి పాలయింది.
ఇదెక్కడి ఇన్నింగ్స్ రా నాయనా..
టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన తర్వాత చివరి 5 ఓవర్లలో 60 పరుగులు కావాల్సిన దశలో ఇంపాక్ట్ ప్లేయర్ గా సమద్ బ్యాటింగ్ కు దిగాడు. ఈ సమయంలో ఎవరైనా అయితే హిట్టింగ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ సమద్ అందుకు భిన్నంగా ఆడడం అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. దారుణమైన ఆటతీరుతో అభిమానులను అసహనానికి గురిచేశాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన సమద్ 13 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒకే ఒక్క బౌండరీ ఉంది. జట్టును గెలిపించాలన్న కనీస ప్రయత్నం అతడు చేయునట్టు స్పష్టంగా కనిపించింది. అతడి కన్నా ఆల్రౌండర్లు జాన్సన్ (13), సుందర్ (10) 100 రెట్లు బెటర్ అన్నట్లుగా ఆడారు. ఉన్న కాసేపు అయినా తమ వంతు న్యాయం చేసే ప్రయత్నం చేశారు. కానీ సమద్ మాత్రం విజయం ఊసే తనకు తెలియదు అన్నట్లుగా ఆడడం గమనార్హం.
Abdul Samad
రనౌట్ గా వెనక్కి వెళ్లిన సమద్..
క్రీజులో ఉన్నంతసేపు అత్యంత చెత్త బ్యాటింగ్ తో అభిమానులను నిరాశకు గురి చేసిన సమద్.. అవసరంలేని పరుగుకు ప్రయత్నించి రన్ అవుట్ గా వెను దిరిగాడు. దారుణ ప్రదర్శన కనబరిచిన అబ్దుల్ సమద్ హైదరాబాద్ జట్టు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. ఇలాంటి బ్యాటింగ్ తాము ఎక్కడ చూడలేదు అంటూ అభిమానులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమద్ వల్లే మ్యాచ్ ఓడిపోయింది అని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. బౌలర్లు వచ్చినట్టు వచ్చి హిట్టింగ్ చేసి వెళుతుంటే.. బ్యాటర్ సమద్ టెస్ట్ మ్యాచ్ ఆడినట్టు ఆడడం దారుణమని పలువురు అభిమానులు పేర్కొన్నారు. ఇలాంటి ఆట తీరుతో ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు నాయనా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. నీలాంటి ఆటగాళ్లు గల్లీలో ఆడుకోవాలి తప్పితే.. ఇలాంటి వేదికలపై కాదంటూ పలువురు ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు.
Web Title: Ipl 2023 fans are trolling on abdul samad
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com