IPL 2023 Chennai Vs Gujarat: చివరి నిమిషం లో రషీద్ ఖాన్ మెరుపులు..గుజరాత్ చేతిలో చెన్నై ఘోర ఓటమి

IPL 2023 Chennai Vs Gujarat: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన IPL సీజన్ వచ్చేసింది. నేడు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం లో తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా చివరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ మూడు పరుగుల తేడా తో గెలుపొందింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న […]

Written By: Vicky, Updated On : April 1, 2023 8:21 am
Follow us on

IPL 2023 Chennai Vs Gujarat

IPL 2023 Chennai Vs Gujarat: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన IPL సీజన్ వచ్చేసింది. నేడు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం లో తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరిగింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా చివరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ మూడు పరుగుల తేడా తో గెలుపొందింది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన బౌలింగ్ మరియు ఫీల్డింగ్ తో రాణించినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన బ్యాటింగ్ తో 176 పరుగులు చేసింది.యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఆట ఆడి సుమారుగా 91 పరుగులు చేసాడు. అంబటి రాయుడు,ధోని కూడా డీసెంట్ ఇన్నింగ్స్ ఇచ్చారు.

177 పరుగుల విజయ లక్ష్యం తో దిగిన గుజరాత్ టైటాన్స్ ప్రారంభ ఓవర్ నుండే అద్భుతమైన ఆతని కనబర్చింది. శుభామ్ గిల్ 50 కి పైగా పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఇచ్చాడు, ఆ తర్వాత విజయ్ శంకర్ 27 పరుగులు మరియు వృద్ధిమాన్ సహా 25 పరుగులు చేసారు. అయితే టాప్ ఆర్డర్ మొత్తం 13 ఓవర్ల తర్వాత కుప్పకూలిపోవడం తో ఇక చెన్నై సూపర్ కింగ్స్ దే విజయం అని అందరూ ఫిక్స్ అయిపోయారు.

IPL 2023 Chennai Vs Gujarat

కానీ చివర్లో రషీద్ ఖాన్ ఒక సిక్స్ మరియు ఒక ఫోర్ కొట్టిన తర్వాత మ్యాచ్ సీన్ మొత్తం మారిపోయింది. అవలీల గా చేస్ చేసి 5 వికెట్ల నష్టం తో 3 పరుగుల తేడా తో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఇక కచ్చితంగా గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ ఓడిపోవడం తో చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్స్ తీవ్రమైన నిరాశలో ఉన్నారు.