
Ruturaj Gaikwad: ఐపీఎల్ 2023 సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో ప్రారంభించింది. గుజరాత్ తో అహ్మదాబాద్ లో జరిగిన తొలి మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ చెన్నై జట్టుకు సానుకూలంగా లభించే అంశం ఓపెన్ రుతు రాజ్ గైక్వాడ్ ఫామ్. 14 పరుగులకే కాన్వే రూపంలో తొలి వికెట్ కోల్పోయినప్పటికీ.. రుతు రాజ్ గైక్వాడ్ బెదరలేదు. గుజరాత్ బౌలర్లను ఒక ఆట ఆడుతున్నాడు. ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 23 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేశాడు.. నాలుగు ఫోర్లు, 9 సిక్సర్లతో గుజరాత్ బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. ఒకానొక దశలో రుతు రాజ్ సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ 8 పరుగుల దూరంలో మూడంకెల స్కోర్ అందుకోలేకపోయాడు. 8 పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకున్నాడు. 50 బంతుల్లో 92 పరుగులు చేసిన రుతురాజ్ క్యాచ్ అవుట్ గా వెనుతిరిగాడు.
92 పరుగుల వరకు రుతు రాజ్ తనకు అచ్చి వచ్చిన బ్యాట్ తో ఆడాడు. తర్వాత ఏమైందో గానీ కొత్త బ్యాట్ తప్పించుకున్నాడు. దీనికి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. శుభ్ మన్ గిల్ పట్టిన క్యాచ్ కు పెవిలియన్ బాట పట్టాడు. అల్జారీ జోసెఫ్ వేసిన పద్దెనిమిదవ ఓవర్ తొలి బంతిని భారీ సిక్సర్ గా మలిచే క్రమంలో గిల్ చేతికి చిక్కాడు. దీంతో రుతు రాజ్ గైక్వాడ్ నిరాశగా మైదానాన్ని వీడాడు. 8 పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకొని ఇబ్బంది పడుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు.

రుతు రాజ్ గైక్వాడ్ నిరాశతో మైదానాన్ని వీడుతున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే 18వ ఓవర్ కు ముందే రుతు రాజ్ గైక్వాడ్ కొత్త బ్యాట్ తెప్పించుకున్నాడు. ఆ బ్యాట్ తో ఆడిన తొలి బంతుకే క్యాచ్ అవుట్ గా వెనుతిరిగాడు. దీంతో అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. అవసరంగా బ్యాట్ మార్చాలని కామెంట్లు చేస్తున్నారు. సెంచరీ అయ్యే వరకు పాత బ్యాట్ తో ఆడి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానిస్తున్నారు. బ్యాట్ మార్చుకుంటే సెంచరీ చేసే వాడివి కదా అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇక రుతు రాజ్ గైక్వాడ్ సూపర్ ఇన్నింగ్స్ కు చివరిలో ధోని మెరుపులు కూడా తోడవడంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఇక గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, జోసెఫ్ రెండేసి వికెట్లు, జోష్ లిటిల్ ఒక వికెట్ తీశాడు. రుతు రాజ్ గైక్వాడ్ ఔట్ అయిన విధానానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Ruturaj Gaikwad ✅
Ravindra Jadeja ✅When @gujarat_titans fought back with two wickets in an over 👌🏻👌🏻
Follow the match ▶️ https://t.co/61QLtsnj3J#TATAIPL | #GTvCSK pic.twitter.com/09ncGUzJWJ
— IndianPremierLeague (@IPL) March 31, 2023