వార్నర్ ఔట్: సన్ రైజర్స్ కొత్త కెప్టెన్ ఇతడే

డేవిడ్ బాయ్ పని అయిపోయింది. వరుసగా ఆరు మ్యాచ్ లలో రాణించకుండా తప్పుడు నిర్ణయాలతో టీంకు అపజయాలను అందించిన సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కథ అర్థాంతరంగా ముగిసింది. టోర్నీలో సగం మ్యాచ్ లు అయిపోయిన వేళ ఇక ముందడుగు వేయడం కష్టమేనన్న తరుణంలో టీం మేనేజ్ మెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆటతో.. నిర్ణయాలతో జట్టుకు భారమైన డేవిడ్ వార్నర్ ను తొలగించింది. ఆ స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలయమ్స్ సన్ ను […]

Written By: NARESH, Updated On : May 1, 2021 4:37 pm
Follow us on

డేవిడ్ బాయ్ పని అయిపోయింది. వరుసగా ఆరు మ్యాచ్ లలో రాణించకుండా తప్పుడు నిర్ణయాలతో టీంకు అపజయాలను అందించిన సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కథ అర్థాంతరంగా ముగిసింది. టోర్నీలో సగం మ్యాచ్ లు అయిపోయిన వేళ ఇక ముందడుగు వేయడం కష్టమేనన్న తరుణంలో టీం మేనేజ్ మెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆటతో.. నిర్ణయాలతో జట్టుకు భారమైన డేవిడ్ వార్నర్ ను తొలగించింది. ఆ స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలయమ్స్ సన్ ను కొత్త కెప్టెన్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం నిర్ణయించింది.

వరుస ఓటములతో టోర్నీలోనే చివరి స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్ మెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత మూడు నాలుగు సీజన్లకు కెప్టెన్ గా వ్యవహరించిన డేవిడ్ వార్నర్ ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్ టీం కెప్టెన్ కేన్ విలియమ్సన్ మిగిలిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021కి కొత్త కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ శనివారం ప్రకటన విడుదల చేసింది.

సన్ రైజర్స్ ఫ్రాంచైజీ డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్ పదవి నుంచి తొలగించింది. ఐపీఎల్-2021 పాయింట్ల పట్టికలో ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచ్ లలో కేవలం 1 విజయం మాత్రమే సాధించిన ఎస్‌ఆర్‌హెచ్ టీం చివరి స్థానంలో ఉంది. దీంతోపాటు ఫాం కోల్పోయి డేవిడ్ వార్నర్ పరుగులు చేయలేకపోతున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తాజాగా ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. “డేవిడ్ వార్నర్ అనేక సంవత్సరాలుగా ఫ్రాంచైజీపై చూపిన అపారమైన ప్రభావాన్ని యాజమాన్యం గౌరవిస్తుంది. అయితే ఈ నిర్ణయం తేలికగా తీసుకోలేదు. మిగిలిన సీజన్‌ను మేము ఎదుర్కోవాలంటే మార్పులు అవసరం. మైదానంలో మరియు వెలుపల విజయం కోసం కృషి చేయడానికి డేవిడ్ వార్నర్ మాకు సహాయం చేస్తాడని ఖచ్చితంగా అనుకుంటున్నాము.” అని టీం మేనేజ్ మెంట్ పేర్కొంది.

రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగే మ్యాచ్ కోసం జట్టు యాజమాన్యం తమ విదేశీ ఆటగాళ్లను మార్చనున్నట్టు సన్‌రైజర్స్ టీం తెలియజేసింది. ఈ మేరకు ఎస్‌ఆర్‌హెచ్ తన ట్విట్టర్‌లోకి అధికారిక ప్రకటన చేసింది.

ఐపీఎల్-2021లో కేన్ విలియమ్సన్ గాయం కారణంగా సీజన్ ప్రారంభంలో కొన్ని మ్యాచ్ లకు దూరమయ్యాడు. కేన్ విలియమ్సన్ ప్రస్తుతం న్యూజిలాండ్ అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్నారు. కుడిచేతి వాటం బ్యాట్స్ మాన్. అప్పుడప్పుడు ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు.

గత సీజన్ లో భీకరంగా ఆడి ఒంటిచేత్తో మ్యాచ్ లను గెలిపించిన డేవిడ్ వార్నర్ ఈసారి బ్యాటింగ్ లోనూ.. కెప్టెన్సీలోనూ తప్పుడు నిర్ణయాలతో టీం అపజయానికి కారణమవుతున్నాడు. అందుకే ఇక అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించినట్టు తెలుస్తోంది.

https://twitter.com/SunRisers/status/1388429789250211843?s=20