https://oktelugu.com/

Border Gavaskar Trophy : ఆ ఆలోచనతో మొదలైంది.. 28 ఏళ్లుగా సాగుతోంది… బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వెనుక ఆసక్తికర సంగతులివి.

మరో మూడు రోజుల్లో ఆస్ట్రేలియా - భారత్ మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి తెరలేవనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ నేపథ్యంలో ఈసారి ఈ సిరీస్ కు ఎక్కడా లేని క్రేజ్ నెలకొంది.

Written By: Anabothula Bhaskar, Updated On : November 19, 2024 1:39 pm
Border Gavaskar Trophy

Border Gavaskar Trophy

Follow us on

Border Gavaskar Trophy : ఈ సిరీస్ లో గెలిస్తేనే టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళ్తుంది. మరోవైపు టెస్టు ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా.. తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఈ సిరీస్ గెలవడం అత్యంత ముఖ్యం.. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ యాషెస్ సిరీస్ తర్వాత అంతటి ప్రాధాన్యం సంతరించుకున్నది. 1996లో ఈ సిరీస్ ప్రారంభమైంది. ఆ ఏడాది ఒక టెస్ట్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా లో భారత్ పర్యటించింది. అయితే రెండు జట్లకు విశిష్టమైన సేవలందించిన అలెన్ బోర్డర్, సునీల్ గవాస్కర్ గౌరవం సిరీస్ నిర్వహించాలని రెండు జట్ల క్రికెట్ బోర్డులు నిర్ణయించాయి. ఆ నిర్ణయాన్ని వెంటనే అమలులో పెట్టాయి. ఫలితంగా ఆ సిరీస్ కు బోర్డర్ – గవాస్కర్ అని పేరు పెట్టాయి. అయితే ఈ తొలి సిరీస్ ను భారత్ గెలుచుకుంది. ఇక ఇప్పటివరకు ఈ సిరీస్ 28 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. గవాస్కర్, బోర్డర్ టెస్టులలో పదివేల కంటే ఎక్కువ పరుగులు చేసి.. తమ జట్టు విజయాలలో కీలక భూమిక పోషించారు.

మనోళ్ళదే పై చేయి

ఇప్పటివరకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లు 16 జరిగాయి. ఇందులో భారత్ 10 సార్లు విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా ఐదుసార్లు ఛాంపియన్ గా అవతరించింది. 2003 -04 సీజన్ మాత్రం డ్రా అయింది. ఇక ఈ సిరీస్ లో చివరిసారిగా నిర్వహించిన నాలుగు ట్రోఫీలలో భారత్ విజయం సాధించింది. ఇక భారత్ వేదికగా 9సార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిర్వహించగా.. 2004 -05 సీజన్లో మాత్రమే ఆస్ట్రేలియా గెలిచింది. ఈ సిరీస్లో గతంలో ఆస్ట్రేలియా గడ్డపై భారత తీవ్రంగా ఇబ్బంది పడేది. అయితే 2017 నుంచి ఆస్ట్రేలియాపై పై చేయి సాధించుకుంటూ వస్తోంది. వరుసగా రెండుసార్లు ఆస్ట్రేలియా జట్టును వారి స్వదేశంలో భారత్ ఓడించింది. అయితే ఈసారి కూడా అదే జోరు కొనసాగించి హార్ట్ సాధించాలని భావిస్తోంది. ఇక ఇప్పటివరకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 56 మ్యాచ్ లు జరిగాయి. వీటిలో భారత్ 24, ఆస్ట్రేలియా 20 మ్యాచ్ లలో విజయాలను సొంతం చేసుకున్నాయి. 12 మ్యాచ్ లు డ్రా గా ముగిశాయి.

నువ్వా నేనా

ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ మధ్య యాషెస్ సిరీస్ ఎలాగైతే జరుగుతుందో.. టీమిండియా – ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా అదే విధంగా సాగుతుంది. ఆటగాళ్లు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతుంటారు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాలలో అనితర సాధ్యమైన విన్యాసాలను ప్రదర్శిస్తారు. వేదికలు మారినప్పటికీ.. అద్భుతమైన ఆట తీరుతో అలరిస్తారు. అందుకే ఈసారి జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఇలాంటి అరుదైన విన్యాసాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు జట్లలో హేమాహేమీల్లాంటి ఆటగాళ్లు ఉన్నారు. వారు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించడంలో సిద్ధహస్తులు. దీంతో ఈసారి జరిగే అయిదు టెస్టులు న భూతో న భవిష్యతి అన్నట్టుగా ఉంటాయని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.