Rinku Singh: ఇండియన్ క్రికెట్ హిస్టరీ లో చాలామంది క్రికెటర్లు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను అయితే సంపాదించుకొని ఇండియన్ టీం కి చాలా సంవత్సరాల పాటు సేవలు అందించారు. ఇక ప్రస్తుతం ఈ జనరేషన్ లో ఉన్న క్రికెటర్లలో కూడా ఇండియన్ టీమ్ కి తమ వంతు సేవలు అందించడానికి రెడీగా ఉంటున్నారు. 2023 ఐపీఎల్ సీజన్ లో అత్యద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చిన ప్లేయర్లలో రింకు సింగ్ ఒకరు. ఈయన ఐపీఎల్ లో గుజరాత్ టీమ్ మీద చివరి ఓవర్లో వరుసగా ఐదు బాల్స్ కి 5 సిక్స్ లు కొట్టి కలకత్తా టీం కి అదిరిపోయే విజయాన్ని అందించాడు. దాంతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.దాంతో ఏషియన్ గేమ్స్ కోసం ఆయన్ని సెలెక్ట్ చేయడం జరిగింది.
ఇక రీసెంట్ గా ఏషియన్ గేమ్స్ లో పాల్గొన్న రీంకు సింగ్ అక్కడ కూడా అత్యద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇక ఇలాంటి సక్సెస్ లు సాధించిన రింకు సింగ్ వెనకాల చాలా కష్టాలు ఉన్నాయి.చిన్నతనం నుంచి కటిక పేదరికంలో ఉంటూ చాలా సంవత్సరాల పాటు క్రికెట్ ప్రాక్టీస్ కోసం డబ్బులు లేక చాలా ఇబ్బందులు కూడా పడేవాడు క్రికెట్ వల్ల మనకు ఏమీ రాదు అనుకుని కొద్ది సంవత్సరాలు వేరే పని కూడా చేసుకొని బతికాడు కానీ టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు కి అవకాశం వస్తుంది అని అనడానికి రింకు సింగ్ ను ఒక ఉదాహరణ గా తీసుకోవచ్చు. చిన్నతనంలో ఆయన పెద్దగా చదువుకోలేదు అయినప్పటికీ చిన్న చిన్న పనులు చేసుకుంటూ క్రికెట్ మీదనే తన ఎక్కువ దృష్టిని పెట్టాడు.
ఇలాంటి క్రమంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందరిని ఆకర్షిస్తూ రంజిల్లో కూడా అదరగొట్టాడు. అలాగే దేశవాళి క్రికెట్లో తనదైన సత్తా చాటిన రింకు సింగ్ ని కొలకత్తా నైట్ రైడర్స్ టీమ్ కొనుగోలు చేయడం జరిగింది.ఇక దాంతో కలకత్తా టీమ్ కి ఆయన చివర్లో ఫినిషర్ గా తన వంతు పాత్ర పోషిస్తూ అదిరిపోయే విజయాలు అందిస్తున్నాడు. ఒకప్పుడు 9వ తరగతి ఫెయిల్ అయిన రింకు సింగ్ ని అందరూ హేళన చేస్తూ మాట్లాడేవారు.కానీ వాళ్ళకి అప్పుడు ఆయన దగ్గర ఉన్న టాలెంట్ గురించి ఎవరికీ తెలియదు.
కాబట్టి తెలిసిన తర్వాత వాళ్లే ఇప్పుడు రింకు సింగ్ ని హీరో అంటూ పొగుడుతున్నారు.ఆయన ఇప్పుడు ప్రపంచంలో ఉన్న హిట్టర్ లలో తను కూడా ఒకడు. నిజానికి రింకు సింగ్ లాంటి ప్లేయర్ ఇండియన్ టీమ్ కి ఫ్యూచర్ లో చాలా సేవలు అందిస్తారు అని అనడం లో ఎంత మాత్రం సందేహం లేదు.ఎందుకంటే ఇప్పుడు ఈయన ఆడుతున్న ఆట తీరు ని చూసిన ప్రతి ఒక్కరూ కూడా ధోని ని రీప్లేస్ చేసే ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క రింకూ సింగ్ మాత్రమే అని అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…