Roha Nadeem: ఆసియా కప్ 2023 బుధవారం(ఆగస్టు 30న) ప్రారంభమైంది. ఆరంభ మ్యాచ్లో నేపాల్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. క్రికెట్ పసికూన నేపాల్‌పై పాక్ జట్టు ప్రతాపం చూసింది. మ్యాచ్ చూసేందుకు మైదానానికి వచ్చిన అభిమానులు.. ఏకపక్ష మ్యాచ్‌ను చూడలేక ఇబ్బంది పడ్డారు. ఈక్రమంలోనే మైదానంలో మెరిసింది అందమైన క్రికెట్ ప్రజెంటర్. తళుక్కుమన్న ఈ యాంకర్‌ను చూసిన ఆడియాన్స్ కళ్లను మరోవైపు తిప్పుకోలేకపోయారు. అంత అందం తనది. అందువల్లే ఆమె అందాన్ని వర్ణిస్తూ కవితలు అల్లుతున్నారు.
రోహా నదీమ్..
పాకిస్తాన్‌లోని ముల్తాన్ వేదికగా జరిగిన నేపాల్– పాకిస్తాన్ మ్యాచ్‌లో రోహా నదీమ్.. వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ క్రమంలో ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఎవరీ అందగత్తె..? అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. అందంతోపాటు చకచకా మాటలు అల్లగల నైపుణ్యమూ ఆమె సొంతం. అంత చక్కగా క్రికెట్ను కవర్ చేస్తోంది.
మహిళా క్రికెటర్, జర్నలిస్ట్..
పాకిస్తాన్‌కు చెందిన రోహా నదీమ్ స్పోర్ట్స్ ప్రజెంటర్ మాత్రమే అనుకోకండి. ఆమె అందమైన, చమత్కారమైన, తెలివైన మరియు మాజీ క్రికెటర్. మహిళా క్రికెటర్ కూడాను. 14 ఏళ్ల వయస్సులోనే రోహా కువైట్ అండర్ 19 జట్టుతోపాటు జాతీయ మహిళల క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగ్రేటం చేసింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించిన 11–దేశాల క్రికెట్ టోర్నమెంట్ కోసం 2010లో సింగపూర్‌లో పర్యటించిన జట్టులో ఆమె భాగం. ఆపై మెల్లమెల్లగా యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. రోహా నదీమ్.. యూకేలోని కార్డిఫ్ విశ్వవిద్యాలయం నుండి జర్నలిజంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసింది.
చెవెనింగ్ స్కాలర్ కూడా..
రోహా నదీమ్ చెవెనింగ్ స్కాలర్ కూడా. చెవెనింగ్ అనేది యూకే ప్రభుత్వ అంతర్జాతీయ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం. ఫారిన్, కామన్వెల్త్ డెవలప్‌మెంట్ ఆఫీస్ మరియు భాగస్వామ్య సంస్థల ద్వారా నిధులు సమకూరుస్తాయి. యూకేలో పూర్తి నిధులతో కూడిన మాస్టర్స్ డిగ్రీ కోర్సులో ఒక సంవత్సరం పాటు చదువుకోవడానికి అవార్డులను అందిస్తాయి.
కాలమిస్టు కూడా..
రోహా నదీమ్ ఒక టీవీ మరియు డిజిటల్ ప్రెజెంటర్‌గా ఉండటమే కాకుండా, పాకిస్తాన్‌లోని రెండు అగ్ర ఆంగ్ల వార్తాపత్రికలు అయిన డాన్, ట్రిబ్యూన్‌కు కాలమ్ రాస్తున్నారు.