Carlos Alcaraz: ‘కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి.. అందుకోసం నిరంతరం శ్రమించండి’ అన్న అబ్దుల్ కలాం మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి. అయితే, ఆ మాటలను అక్షరాల నిజం చేసి చూపించాడు వింబుల్డన్ కోటలో సరికొత్త రారాజుగా అవతరించిన కార్లోస్ అల్కరాజ్. వింబుల్డన్ లో విజయం సాధించడమే తన లక్ష్యమని 12 ఏళ్ల వయసులో తన మనసులో మాటను చెప్పిన.. దాన్ని 20 ఏళ్ల వయసులో దాన్ని సాకారం చేసుకుని సత్తా చాటాడు.
వింబుల్డన్ ఫైనల్ లో కార్లోస్ అల్కరాజ్ సంచలనం సృష్టించాడు. హోరాహోరీగా సాగిన పోరులో టాప్ సీడ్ ఆటగాడు అయిన అల్కరాజ్ 1-6, 7-6, (8-6), 6-1, 3-6, 6-4 తో రెండో సీడ్ జకోవిచ్ పై విజయం సాధించిన విషయం తెలిసిందే. నాలుగు గంటల 42 నిమిషాలపాటు సాగిన పోరులో.. తొలి సెట్ ఒడినప్పటికీ అద్భుతంగా పుంజుకున్న ప్రపంచ నెంబర్ వన్ అల్కరాజ్ గొప్ప విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఆల్కరాజ్ తొమ్మిది యేస్ లు, 66 విన్నర్లు కొట్టాడు.
సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియో వైరల్..
కార్లోస్ అల్కరాజ్ అషామాషీగా వింబుల్డన్ విజయం సాధించలేదు. చిన్న వయసులోనే వింబుల్డన్ ట్రోఫీ సాధించడమే తన కల అంటూ అల్కరాజు చెప్పిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఎవరో ఒక వ్యక్తి నీ డ్రీమ్ ఏంటి అని అడగగా.. ఆల్కరాజ్ వింబుల్డన్ సాధించడమే తన కల అంటూ స్పష్టం చేశాడు. రోజర్ ఫెడరల్ తన అభిమాన ఆటగాడు అంటూ అల్కరాజ్ చెప్పిన విడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. వింబుల్డన్ తోపాటు రోలాండ్ గారోస్ కూడా తన లక్ష్యంగా అందులో పేర్కొన్నాడు.
Dreams come true, Carlitos! ♥️ pic.twitter.com/NWeSEdWj4j
— Marcela Linhares (@ma__linharess) July 16, 2023