Yuvraj Singh: ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా దేశం కోసం ఆడిన ఆ క్రికెట్ వీరుడు ఎవరంటే..?

వరల్డ్ కప్ లో ప్రతి ప్లేయర్ కూడా చాలా అద్బుతం గా ఆడారు. ఇక అందులో భాగంగానే వెస్టిండీస్ మీద ఆడిన ఒక కీలకమైన మ్యాచ్ లో యువరాజ్ సింగ్ బ్యాటింగ్ చేస్తూ నోట్లో నుంచి రక్తం కక్కుకున్నాడు.

Written By: Gopi, Updated On : November 18, 2023 8:36 am

Yuvraj Singh

Follow us on

Yuvraj Singh: 2011 వ సంవత్సరంలో ఇండియా భారీ పోరాటం చేసే వరల్డ్ కప్ గెలుచుకుంది. అందులో భాగంగానే యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ది సీరీస్ గా నిలవడం మన ఇండియన్ టీమ్ కి గర్వ కారణము అనే చెప్పాలి…

ఇక ఆ వరల్డ్ కప్ లో ప్రతి ప్లేయర్ కూడా చాలా అద్బుతం గా ఆడారు. ఇక అందులో భాగంగానే వెస్టిండీస్ మీద ఆడిన ఒక కీలకమైన మ్యాచ్ లో యువరాజ్ సింగ్ బ్యాటింగ్ చేస్తూ నోట్లో నుంచి రక్తం కక్కుకున్నాడు. ఆ టైం లో అతన్ని చూసిన తోటి ప్లేయర్లను కానీ, అభిమానులను కానీ టీవీల్లో మ్యాచ్ చూస్తున్న వాళ్ళ గుండెని ఒక్కసారి కదిలించింది. ఇక దాంతో ఫీల్డ్ ఎంపైర్ యువరాజు దగ్గరికి వచ్చి రిటైర్డ్ హార్ట్ కింద ఇక్కడి నుంచి వెళ్లిపో నీ హెల్త్ కండిషన్ బాగాలేదు అని ఎంపైర్ అన్నప్పుడు యువరాజ్ చెప్పిన సమాధానం 2011 ఇండియన్ టీం కి వరల్డ్ కప్ వచ్చేలా చేసింది…

ఆ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ టాప్ ఆర్డర్ మొత్తం కుప్ప కూలిపోయింది దాంతో ఇండియన్ టీమ్ యువరాజ్ ఒక్కడి పోరాటం వల్ల గెలిచిందనే చెప్పాలి. ఆ మ్యాచ్ లో ఒకవేళ గ్రౌండ్ లో నుంచి అప్పుడు యువరాజ్ వెళ్ళిపోతాను అంటే మాత్రం ఇండియా సెమీ ఫైనల్ కి వెళ్లకుండానే వెను తిరిగేది…కానీ యువరాజ్ అలా చేయలేదు యువరాజ్ ఎంపైర్ తో నేను ఎలాగైనా మ్యాచ్ లో పోరాటం చేస్తాను,నా ఈ పోరాటంలో నా ప్రాణం పోయిన పర్లేదు ఒకవేళ నేను ఆడుతూ ఆడుతూ నా ప్రాణాన్ని కోల్పోతే స్ట్రచ్చార్ పైన నా బాడి ని తీసుకెళ్లండి, కానీ స్ట్రచ్చార్ పై నన్ను తీసుకెళ్లేటప్పుడు మాత్రం నా బాడీ మీద నా జాతీయ జెండాను కప్పి తీసుకెళ్లండి అంటూ దేశం మీద, తను ఆడుతున్న క్రికెట్ మీద తనకున్న గౌరవాన్ని చాలా అద్భుతంగా తెలియజేశాడు.ఇక యువరాజ్ సింగ్ ని ఈ మ్యాచ్ లో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తూ కనిపించారు.

నోట్లో నుంచి రక్తం కారుతున్న కూడా నాప్కిన్స్ తో తూడ్చుకుంటూ మరి ఒంటరి పోరాటం చేసి ఆ మ్యాచ్ ని గెలిపించాడు. ఒక రకంగా చెప్పాలంటే యువరాజ్ సింగ్ లేకపోతే 2011 వరల్డ్ కప్పు లేదు…అలాంటి వీరుడు క్యాన్సర్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకొని కోలుకొని మళ్ళీ ఇండియన్ టీమ్ లోకి వచ్చి చాలా మ్యాచు లు కూడా ఆడాడు చాలా మ్యాచ్ లు గెలిపించాడు. ఇక ఇలాంటి ప్లేయర్ ఇండియన్ టీమ్ లో ఉండటం మనం అందరి అదృష్టం…

ఎందుకంటే ఆ రోజు ఆయన మ్యాచ్ ఆడిన తీరుకి ప్రత్యర్థి ప్లేయర్లు సైతం సెల్యూట్ చేశారు అంటే ఆ గొప్ప వ్యక్తి చేసిన పోరాటం అలాంటిది.2011 వరల్డ్ కప్ అంటే మనకు గుర్తుకు వచ్చేది యువరాజ్ సింగ్ పోరాటం మాత్రమే ఆయన చాలా మ్యాచ్ లను ఒంటి చేత్తో గెలిపించాడు. ఇక ఇప్పటి వరకు కూడా యువరాజ్ సింగ్ ప్లేస్ ని రీప్లేస్ చేసే ఆటగాడు ఇండియన్ టీమ్ లో ఎవరు లేరనే చెప్పాలి…