Viral Video: పాకిస్తాన్ పై భారత విజయాన్ని ఊరువాడా అంతా నిన్న రాత్రి పండుగ చేసుకున్నారు. జాతీయ జెండాలు పట్టుకొని వీధుల్లోకి వచ్చి తమ సంతోషాలను చేసుకున్నారు.ఇక ఇదే సమయంలో గత ప్రపంచకప్ టీ20లో భారత్ పై పాకిస్తాన్ గెలిచినప్పుడు కూడా కొందరు జాతి వ్యతిరేకులు, ఒక వర్గం వారు పాకిస్తాన్ గెలుపును సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీ, కశ్మీర్ వంటి చోట్లలో ఈ సంబరాలు కనిపించాయి. వారిపై అందరూ మండిపడ్డారు.

భారత్ పాకిస్తాన్ లలోనే కాదు.. తాలిబన్ల పాలనలో ఉన్న అప్ఘనిస్తాన్ లో సైతం ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ను జనాలు చూశారు. మరి పాక్ పక్కనుండే ఈ ముస్లిం కంట్రీ ఎవరికి సపోర్ట్? అక్కడి యువత ఎవరిని గెలవాలని అనుకున్నారు అన్నది బయటపడింది.
అప్ఘనిస్తాన్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్న అప్ఘనిస్తాన్ యువకులు.. హార్ధిక్ పాండ్యా టీమిండియాను గెలిపించగానే హర్షం వ్యక్తం చేస్తూ కేరింతలు కొట్టారు. ఒక యువకుడు అయితే లేచి పరిగెత్తుకొచ్చి భారత్ ను గెలిపించిన హార్ధిక్ కు ముద్దు పెట్టాడు. అనంతరం భారత్ గెలిచిందంటూ చేతులు పైకెత్తుతూ హర్షం వ్యక్తం చేస్తూ బయటకు వెళ్లిపోయాడు.

ఆఫ్ఘాని యువకుడి సంబరం వీడియో వైరల్ అయ్యింది. హార్దిక్ పాండ్యా సిక్స్ కొట్టి గెలిపించిన తర్వాత అతడి ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. అప్ఘనిస్తాన్ లోనూ కుట్రలు చేసి తాలిబన్లతో వారిని నరకం చూపిస్తున్న పాకిస్తాన్ కుట్రలను అక్కడి జనం వ్యతిరేకిస్తున్నారు. అందుకే పాక్ ఓడిపోగానే సంబరాలు చేసుకున్నారు. భారత్ గెలుపును కాంక్షించారు.
అప్ఘన్ లో సైతం భారత్ కు అనుకూలంగా సంబరాలు పోటెత్తడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక్కడ సకల సౌకర్యాలు పొందుతూ పరాయి వాళ్ళ పాట పాడే వాళ్ల కన్నా వెయ్యిరెట్లు అప్ఘనిస్తానీయులు మేలు కదా.. అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.