Shubman Gill: ఒక వ్యక్తి పైన గుడ్డి ప్రేమ ఎప్పటికీ కరెక్ట్ కాదు. అది కూడా ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించే వ్యవహారంలో వ్యక్తి పూజ ఏమాత్రం సమంజసం కాదు. దానివల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో గౌతమ్ గంభీర్, గిల్ వ్యవహారం కళ్ళకు కడుతోంది.
గిల్ మీద విపరీతమైన ప్రేమతో టెస్ట్ ఫార్మాట్ నుంచి గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని పంపించాడు. వన్డే ఫార్మాట్లో రోహిత్ శర్మ నామమాత్ర పాత్రకు పరిమితం చేశాడు.. సంజు శాంసన్ లాంటి ప్లేయర్లను రిజర్వ్ బెంచుకు అంకితం చేశాడు.. చివరికి తప్పు తెలుసుకొని టి20 వరల్డ్ కప్ లో గిల్ ను పక్కన పెట్టాడు.
ఈ ఏడాది జూన్ నెలలో గిల్ టెస్ట్ జట్టుకు సారథి అయ్యాడు. గిల్ నాయకత్వంలో టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ను సమం చేసుకుంది. వెస్టిండీస్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ను సొంతం చేసుకుంది. గిల్ ఆస్ట్రేలియా గట్టుతో జరిగిన వన్డే సిరీస్ కు నాయకత్వం వహించాడు. ఆ సిరీస్ కూడా టీమిండియాకుల్ పోయింది. గిల్ రికార్డు ఇలా ఉన్నప్పటికీ.. అతడిని టి20 ఫార్మాట్లో కూడా నాయకుడిని చేయడానికి గంభీర్ తహతహలాడాడు. అతడిని నేరుగా సారధిని చేయకుండా.. వైస్ కెప్టెన్ చేశాడు. వాస్తవానికి గిల్ కనక స్థిరంగా ఆడితే సూర్య కుమార్ యాదవ్ స్థానంలో కెప్టెన్ గా నియమించేవాడు గౌతమ్ గంభీర్.
గిల్ కెప్టెన్ అవడం ఏమోగానీ.. అతడు జట్టులో చోటే కోల్పోయాడు. వాస్తవానికి భవిష్యత్తు కాలంలో సూపర్ స్టార్ అవుతాడు అనుకుంటే.. గిల్ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఉపసారధిగా నియమించడానికి ముందు గిల్ ఏడాదిపాటు పొట్టి ఫార్మేట్ లో లేని లేడు.. సరైన కారణం లేకుండానే అక్షర్ పటేల్ ను ఉపసారథిగా తప్పించారు. గిల్ ఉపసారథి అయిన తర్వాత 15 టి20 మ్యాచ్ లు ఆడిన గిల్ 24.25 సగటుతో 291 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన మూడు మ్యాచ్లలో 4, 0, 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
వాస్తవానికి అంత దారుణంగా ఆడినప్పటికీ అతడికి చివరి మ్యాచ్లో అవకాశం లభించేది. విమర్శలు తీవ్ర స్థాయిలో రావడంతో సంజు శాంసన్ కు చోటు కల్పించారు. అతడు 37 పరుగులు చేసి సత్తా చూపించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ చేసి ఫైనల్ మ్యాచ్లో జార్ఖండ్ జట్టును గెలిపించాడు. ఆ మ్యాచ్ కు ఆర్పి సింగ్, ఓజా హాజరయ్యారు.. ఫాం ప్రకారం చూసుకుంటే సంజు, ఇషాన్ ముందు నిలబడలేకపోయాడు.. దీంతో అతడిని t20 వరల్డ్ కప్ జట్టు నుంచి తొలగించారు.
వాస్తవానికి టి20 లలో గిల్ సరిగ్గా ఆడలేక పోతున్నప్పటికీ కొద్ది రోజుల ముందు వరకు టి20 ప్రపంచ కప్ కు ఎంపిక చేయాలని గౌతమ్ గంభీర్, అజిత్ అగర్కార్ డిసైడ్ అయ్యారు. కానీ ఆ తర్వాత ఊహించని విధంగా జట్టులో పరిస్థితులు మారిపోయాయి. మరోవైపు గిల్ ఆడుతున్న తీరు చూస్తే ఇప్పట్లో అతడు టి20 జట్టులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. బీభత్సమైన ఫినిషర్ పాత్ర పోషిస్తున్న జితేష్ శర్మ మీద మేనేజ్మెంట్ వెయిట్ వేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటివరకు రింకు సింగ్ ను పక్కనపెట్టి జితేష్ శర్మకు మేనేజ్మెంట్ అవకాశాలు ఇచ్చింది. అయితే ఉన్నట్టుండి రింకు సింగ్ ను జట్టులోకి మేనేజ్మెంట్ ఎందుకు తీసుకుందో అర్థం కావడం లేదు.