India Vs Australia: ఇండియా ప్రస్తుతం ఏషియా కప్ కొట్టి మంచి జోష్ మీద ఉంది అయినప్పటికీ ఈనెల 22 ,24, 27 వ తేదీల్లో ఇండియా ఆస్ట్రేలియా తో మూడు వన్డే మ్యాచులు ఆడుతుంది.దానికి సంభందించిన టీం ని రీసెంట్ గా ప్రకటించినప్పటికీ ఈ టీం లో చాలా మంది యంగ్ ప్లేయర్లకి కూడా ఛాన్స్ లు ఇవ్వడం జరుగుతుంది.నిజానికి ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా ఏం కాదు కానీ ప్లేయర్లందరిని ఒకసారి టెస్ట్ చేయడానికి మాత్రమే బిసిసిఐ ఈ మ్యాచ్ లను వాడుకుంటుంది.ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే వరల్డ్ కప్ సమీపిస్తున్న టైం లో ఇండియా టీం చాలా కసరత్తులను కూడా సిద్ధం చేస్తున్నట్టు గా తెలుస్తుంది…
వరల్డ్ కప్ లో ఇండియా మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియా తో ఆడనున్న సందర్భం లో దానికోసం ఏ టీం అయితే బాగుటుంది అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న అయితే ఇలాంటి ప్రశ్నలు రాకూడదనే టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఇప్పటికే ఒక ప్లేయింగ్ 11 టీం ని రెడీ చేసి పెట్టినట్టు గా తెలుస్తుంది. అందులో ఎవరెవరు ఉంటారు అనేది మనం ఒకసారి తెలుసుట్టుకుందాం…
ఓపెనర్లు గా శుభమన్ గిల్, రోహిత్ శర్మ ఉంటారు.ఇక వీళ్ల తర్వాత నెంబర్ త్రి లో కోహ్లీ ఉంటాడు,నెంబర్ ఫోర్ లో కె ఎల్ రాహుల్, నెంబర్ ఫైవ్ లో ఇషాన్ కిషన్,నెంబర్ సిక్స్ లో హార్దిక్ పాండ్య, నెంబర్ సెవన్ లో రవీంద్ర జడేజా,నెంబర్ ఎయిట్ లో శార్దూల్ ఠాకూర్, నెంబర్ నైన్ లో కుల్దీప్ యాదవ్, నెంబర్ టెన్ లో మహమ్మద్ సిరాజ్, నెంబర్ లెవన్ లో జస్ప్రీత్ బుమ్రా లాంటి ప్లేయర్లతో ఇండియా ప్లేయింగ్ లెవన్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది.ఇక పేస్ విభాగంలో బుమ్రా, సిరాజ్ ఉండగా బాల్ ని స్వింగ్ చేస్తూ వికెట్లు తీయడానికి శార్దూల్ ఠాకూర్ కూడా ఉన్నాడు. ఇక స్పిన్ తో ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్స్ ని ముప్పు తిప్పలు పెట్టడానికి జడేజా, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. ఇక ఈ మధ్య ఎక్స్ట్రా బౌలర్ గా హార్దిక్ పాండ్య కూడా చాలా సూపర్ గా బౌలింగ్ చేస్తూ వికెట్లు కూడా తీస్తున్నాడు…
ఇక ఈ మ్యాచ్ లో బ్యాట్స్ మెన్స్ పరంగా చూసుకుంటే గిల్,రోహిత్ శర్మ, కోహ్లీ, రాహుల్,హార్దిక్ పాండ్య లలో ఒక ముగ్గురు ప్లేయర్లు కనక చివరి వరకు అడగలిగితే ఇండియా టీం భారీ స్కోర్ చేయగలదు. అలాగే బౌలింగ్ లో కూడా ఇండియన్ బౌలర్లు వాళ్ళ సత్తా చాటితే ఇండియా కి గెలుపు అనేది పెద్ద మ్యాటర్ కాదు…ఇక ఈ మ్యాచ్ లో ఇండియా గెలిచి ఆస్ట్రేలియా మీద ఆధిపత్యాన్ని చూపిస్తూ వరల్డ్ కప్ లో గ్రాండ్ విక్టరీ కొట్టాలని మంచి ఆశ తో ఉన్నట్టు గా తెలుస్తుంది. మరి ఈ మ్యాచ్ లో గెలిచి ఇండియా శుభారంభాన్ని అందుకోవాలని అలాగే ఇండియా వరల్డ్ కప్ కూడా కొట్టాలని కోరుకుందాం…