Balakrishna And NTR: బాలకృష్ణ-ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందనేది నిజం. చెప్పాలంటే ఈ గొడవలు ఇప్పటివి కావు. 2009లో టీడీపీ తరపున ఎన్టీఆర్ ప్రచారం చేశారు. అయితే పార్టీ గెలవలేదు. తర్వాత ఏమైందో తెలియదు… ఎన్టీఆర్, హరికృష్ణ టీడీపీతో డిస్టెన్స్ మైంటైన్ చేస్తూ వచ్చారు. అప్పుడప్పుడు సినిమా వేదికలపై బాలయ్య, ఎన్టీఆర్ కలిశారు. టీడీపీ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ పాల్గొనడం లేదు. చివరికి తాతయ్య ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరు కాలేదు. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేస్తే స్పందించలేదు.
బాలకృష్ణ, చంద్రబాబు అంటే ఇష్టం లేకే ఎన్టీఆర్ ఇలా చేస్తున్నాడనే వాదన బలంగా వినిపిస్తోంది. బాలకృష్ణ ఫ్యాన్స్, టీడీపీ వర్గాలు ఎన్టీఆర్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఇలా ప్రవర్తించడానికి ఆయనకు బాలయ్య సరైన గౌరవం ఇవ్వకపోవడమే అనే మరోవాదన ఉంది. ఆ మధ్య తారకరత్న దశదిన కర్మను బాలకృష్ణ తన అద్వైర్యంలో నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరినీ బాలకృష్ణ పలకరించారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను పట్టించుకోలేదు. లేచి నిలుచున్న వాళ్ళను పలకరించకుండా వెళ్ళిపోయాడు.
బాలకృష్ణ కావాలనే వారిని అవైడ్ చేశారంటూ ఓ వీడియో వైరల్ అయ్యింది. ఇవన్నీ పక్కన పెడితే బాలయ్య-ఎన్టీఆర్ మధ్య చిచ్చు పెడుతుంది ఓ మాజీ మంత్రి అంటూ ప్రచారం జరుగుతుంది. హరికృష్ణ, ఎన్టీఆర్ లకు అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని వలెనే నందమూరి కుటుంబంలో గొడవలు అంటున్నారు. వైసీపీ నేతగా ఉన్న కొడాలి నాని చెప్పినట్లు వింటూ ఎన్టీఆర్ బాలయ్య కుటుంబానికి దూరం అవుతున్నాడనే వాదన తెరపైకి వచ్చింది.
బాలయ్య ఫ్యాన్స్ ప్రధాన ఆరోపణగా ఇది ఉంది. కొడాలి నాని గతంలో నిర్మాతగా వ్యవహరించారు. వల్లభనేని వంశీ, కోడలి నానితో ఎన్టీఆర్ ఘాడమైన స్నేహ బంధం కలిగి ఉన్నాడు. కొడాలి నాని, వంశీ ఇప్పుడు వైసీపీ లో ఉన్నారు. ఒకప్పుడు వీరు టీడీపీ లీడర్లు. వాళ్ళు పార్టీ మారినా ఎన్టీఆర్ తో స్నేహం మాత్రం కొనసాగుతుందట. ఇటీవల ఎన్టీఆర్ మేనల్లుడు వివాహం జరగ్గా కొడాలి నాని హాజరయ్యాడు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.