ICC Test Rankings 2023: బౌలింగ్ విభాగంలో అశ్విన్.. ఆల్ రౌండర్ కేటగిరీలో జడేజా.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత్ హవా..!

ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఇండియా ఆటగాళ్లు అదరగొడుతున్నారు. టెస్ట్ క్రికెట్ కు సంబంధించి ఐసీసీ ర్యాంకులను విడుదల చేసింది. ఐసీసీ విడుదల చేసిన బ్యాటర్ల జాబితాలో కేన్ విలియమ్సన్ అగ్రస్థానాన్ని దక్కించుకోగా,

Written By: BS, Updated On : July 6, 2023 9:28 am

ICC Test Rankings 2023

Follow us on

ICC Test Rankings 2023: ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్టు ఆటగాళ్ల ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ఐసీసీ ప్రకటించిన జాబితా ప్రకారం భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తమ ర్యాంకులను పదిలం చేసుకున్నారు. బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ టాప్ ర్యాంకును నిలబెట్టుకోగా, ఆల్రౌండర్ జాబితాలో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఐసీసీ ఈ మేరకు ర్యాంకులను బుధవారం విడుదల చేసింది.

ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఇండియా ఆటగాళ్లు అదరగొడుతున్నారు. టెస్ట్ క్రికెట్ కు సంబంధించి ఐసీసీ ర్యాంకులను విడుదల చేసింది. ఐసీసీ విడుదల చేసిన బ్యాటర్ల జాబితాలో కేన్ విలియమ్సన్ అగ్రస్థానాన్ని దక్కించుకోగా, బౌలర్ల జాబితాలో భారత జట్టు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టాప్ స్థానాన్ని దక్కించుకొని సత్తా చాటాడు. అలాగే ఆల్రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో ఐసీసీ బుధవారం విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ జాబితాలో రెండు కేటగిరీల్లో భారత ఆటగాళ్లు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న అశ్విన్..

వరల్డ్ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో భారత జట్టు తరపున రవి చంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో 860 రేటింగ్ పాయింట్లతో అశ్విన్ అగ్రస్థానాన్ని దక్కించుకోగా, 826 రేటింగ్ పాయింట్లతో ఆస్ట్రేలియా బౌలర్ పాత్ కమిన్స్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ రబడ 825 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, 813 పాయింట్లతో ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ నాలుగో స్థానంలో నిలిచాడు. 803 పాయింట్లతో ఇంగ్లాండ్ కు చెందిన ఓల్లీ రాబిన్షన్ ఇదో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ జాబితాలో భారత జట్టు నుంచి 772 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో బుమ్రా కొనసాగుతుండగా, 765 పాయింట్లతో రవీంద్ర జడేజా తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. బుమ్రా గాయం కారణంగా గత కొన్నేళ్ల నుంచి క్రికెట్ కు దూరంగా ఉన్నప్పటికీ టాప్ 10 లో స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం.

ఆల్ రౌండర్ జాబితాలో జడేజా..

ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ఆల్రౌండర్ ర్యాంకింగ్స్ లోను భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ఈ జాబితాలోని తొలి రెండు స్థానాలను భారత ఆటగాళ్లు దక్కించుకున్నారు. 434 రేటింగ్ పాయింట్లతో రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 352 రేటింగ్ పాయింట్లతో రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే బంగ్లాదేశ్ కు చెందిన షకీబుల్ హసన్ 332 పాయింట్లతో మూడో స్థానంలో, ఇంగ్లాండుకు చెందిన బెన్ స్టోక్స్ 326 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా, భారత జట్టుకు చెందిన మరో ఆటగాడు అక్షర్ పటేల్ 310 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. టెస్ట్ ఆల్రౌండర్ ర్యాంకింగ్స్ కేటగిరీలో టాప్ ఫైవ్ లో భారత జట్టుకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటడం పట్ల అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.