Chess Olympiad 2024 : 45వ చెస్ ఒలింపియాడ్‌లో ఆఖరి రౌండ్‌లో తమ ప్రత్యర్థులను ఓడించి భారత పురుషుల, మహిళల జట్లు తమ తొలి బంగారు పతకాలను కైవసం చేసుకున్నాయి. దీంతో చెస్ ఒలింపియాడ్ లో ఆదివారం ఇండియా చరిత్ర సృష్టించింది. 11వ , ఆఖరి రౌండ్ మ్యాచ్‌లో డి గుకేష్, అర్జున్ ఎరిగైసి , ఆర్ ప్రగ్ననాధ తమ తమ మ్యాచ్‌లను గెలవడంతో ఈ పురుషుల జట్టు స్లోవేనియాను ఓడించింది. మహిళల జట్టు 3.5-0.5తో అజర్‌బైజాన్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
India wins the 45th FIDE #ChessOlympiad! ♟️
Congratulations to Gukesh D, Praggnanandhaa R, Arjun Erigaisi, Vidit Gujrathi, Pentala Harikrishna and Srinath Narayanan (Captain)!
Gukesh D beats Vladimir Fedoseev, and Arjun Erigaisi prevails against Jan Subelj; India… pic.twitter.com/jOGrjwsyJc
— International Chess Federation (@FIDE_chess) September 22, 2024
చెస్ ఒలింపియాడ్ టోర్నమెంట్‌లో ఇంతకుముందు 2014 , 2022లో భారత పురుషులు రెండు కాంస్య పథకాలు సాధించారు. చెన్నైలో 2022 ఎడిషన్‌లో భారత మహిళలు కాంస్యం గెలుచుకున్నారు.ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఛాలెంజర్ గుకేశ్ , అర్జున్ ఎరిగైస్ మళ్లీ కీలక గేమ్‌లలో విజయం సాధించడంతో ఈ అద్భుత ఫీట్ సాధ్యమైంది. ఓపెన్ విభాగంలో భారత్‌కు మొదటి టైటిల్‌ను సాధించడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు.
India wins the 45th FIDE Women's #ChessOlympiad! ♟
Congratulations to Harika Dronavalli, Vaishali Rameshbabu, Divya Deshmukh, Vantika Agrawal, Tania Sachdev and Abhijit Kunte (Captain)! pic.twitter.com/zsNde0tspo
— International Chess Federation (@FIDE_chess) September 22, 2024
స్లోవేనియాతో జరిగిన మ్యాచ్‌లో వ్లాదిమిర్ ఫెడోసీవ్‌తో జరిగిన మ్యాచ్‌లో టెక్నికల్ ఫేజ్‌లో గూకేష్ తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాడు. ఇది చాలా టఫ్ మ్యాచ్ గా జరిగింది. ఇందులో విజయం సాధించిన 18 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ గూకేష్ తన అద్భుతమైన వ్యూహాత్మక ప్రదర్శనతో భారత్ కు విజయాన్ని అందించాడు.
ఇదే ఒరవడిలో ప్రగ్ననాధ తన ఫామ్‌ను సాధించాడు. స్లోవేనియన్ అంటోన్ డెమ్‌చెంకోపై అద్భుతమైన విజయాన్ని సాధించాడు. దీంతో ఇండియా ఇంకా ఒక గేమ్ మిగిలి ఉండగానే స్లోవేనియాపై 3-0 విజయాన్ని సాధించింది.22 పాయింట్లకి గాను భారత పురుషులు ఏకంగా 21 పాయింట్లతో టోర్నమెంట్ ను ముగించారు.
అజర్‌బైజాన్‌పై 3.5-0.5 తేడాతో విజయం సాధించిన భారత మహిళలు దేశానికి అరుదైన డబుల్ స్వర్ణాన్ని అందించారు.
డి హారిక జట్టు టాప్ బోర్డులో తన అత్యుత్తమ స్ట్రైకింగ్‌తో విజయాన్ని అందించింది. దివ్య దేశ్‌ముఖ్ తన ప్రత్యర్థిని మరోసారి ఓడించి మూడవ బోర్డ్‌లో కూడా తన వ్యక్తిగత బంగారు పతకాన్ని సాధించింది.
ఆర్ వైశాలి తన గేమ్‌ను డ్రా చేసుకున్న తర్వాత, వంటికా అగర్వాల్ మరో అద్భుతమైన విజయాన్ని సాధించడంతో భారత జట్టు విజయాన్ని ఖాయం చేసుకుంది.
ఇలా చెస్ ఒలింపియాడ్ లో రెండు గోల్డ్ మెడల్స్ మనవే కావడం విశేషంగా చెప్పొచ్చు. చరిత్రలో మొట్టమొదటి సారి మన అమ్మాయిలు, అబ్బాయిలు ఫైనల్స్ గెలిచి చరిత్ర సృష్టించారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More