Homeక్రీడలుSunil Chhetri: ఫుట్ బాల్ కు సునీల్ చెత్రీ వీడ్కోలు.. హైదరాబాద్ తో ఉన్న అనుబంధం...

Sunil Chhetri: ఫుట్ బాల్ కు సునీల్ చెత్రీ వీడ్కోలు.. హైదరాబాద్ తో ఉన్న అనుబంధం ఎలాంటిదంటే?

Sunil Chhetri: క్రికెట్ మానియాలో ఊగిపోయే మనదేశంలో.. ఫుట్ బాల్ ఆటకు సరికొత్త గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ముమ్మాటికి సునీల్ చెత్రి దే. 150 మ్యాచ్ లో 94 గోల్స్ చేసి.. ఫుట్ బాల్ దిగ్గజాలు రొనాల్డో, మెస్సి తర్వాతి స్థానాలలో సునీల్ కొనసాగుతున్నాడు. అటువంటి దిగ్గజ ఆటగాడు తన ఆటకు వీడ్కోలు పలికాడు. జూన్ 6న కువైట్ జట్టుతో జరిగే ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ తనకు చివరిదని పేర్కొన్నాడు.

సునీల్ చెత్రీ 2005లో జాతీయ ఫుట్ బాల్ జట్టులోకి ప్రవేశించాడు. ఇప్పటివరకూ అనేక అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. 94 గోల్స్ చేశాడు. ప్రస్తుత ఫుట్ బాల్ చరిత్రలో యాక్టివ్ గా ఉన్న ఆటగాళ్లల్లో.. ఎక్కువ గోల్స్ చేసిన ప్లేయర్ గా సునీల్ మూడవ స్థానంలో ఉన్నాడు. ఇతడి కంటే ముందు రొనాల్డో 128, మెస్సి 106 గోల్స్ తో ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నారు.

సునీల్ దాదాపు రెండు దశాబ్దాలుగా భారత ఫుట్ బాల్ జట్టుకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. భారత జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. మన దేశమే కాదు ఆసియా లోనూ సునీల్ తరహాలో గోల్స్ చేసిన ఆటగాడు మరొకరు లేరు. 2011, 2015, 2021లో శాఫ్ ఛాంపియన్స్ ట్రోఫీ, 2007, 2009, 2012 నెహ్రూ కప్ టోర్నమెంట్ లలో సునీల్ అద్భుతమైన గోల్స్ చేశాడు. 2008లో ఏఎఫ్సీ చాలెంజ్ కప్ ను ఇండియా జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

సునీల్ కు హైదరాబాద్ నగరంతో ప్రత్యేక అనుబంధం ఉంది. 1984 ఆగస్టు 3న చెత్రి, సుశీల దంపతులకు సునీల్ జన్మించాడు. సునీల్ తండ్రి ఇండియన్ ఆర్మీలో పని చేయగా.. తల్లి క్రీడాకారిణి. నేపాల్ మహిళల జాతీయ ఫుట్ బాల్ జట్టుకు ఆమె ప్రాతినిధ్యం వహించారు. సునీల్ ప్రాథమిక విద్యాభ్యాసం సిక్కిం రాష్ట్రంలో జరిగింది. ఆ తర్వాత కోల్ కతా లో ఉన్నత విద్యను పూర్తి చేశాడు. 2017 లో సోనం భట్టాచార్యను వివాహం చేసుకున్నాడు. సునీల్ కు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. పశ్చిమ బెంగాల్లో అతడి పేరు వినిపిస్తే చాలు.. అభిమానులు పూనకాలు ఊగిపోతారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, గోవా, ఢిల్లీ ప్రాంతాలలో సునీల్ కు ప్రత్యేకంగా అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి.

ప్రారంభంలో సునీల్ అనేక ఇబ్బందులు పడ్డాడు. ఈ నేపథ్యంలో నేషనల్ ఫుట్ బాల్ లీగ్ లో మోహన్ బగాన్ అథ్లెటిక్ క్లబ్లో చేరాడు. 2002 -03 లో తొలి సీజన్లోనే క్లబ్ పట్టికలో ఏకంగా ఏడవ స్థానంలో నిలిచాడు. నాలుగు గోల్స్ చేసి అదరగొట్టాడు. ఇక 2009లో క్వీన్స్ పార్క్ రేంజర్స్, ఇంగ్లీష్ ఫుట్ బాల్ ఛాంపియన్ లీగ్ జట్టుతో మూడు సంవత్సరాల పాటు ఒప్పందం కుదుర్చుకున్నాడు.ఫిఫా ప్రపంచ ర్యాంకింగ్స్ జాబితాలో భారతదేశం టాప్ – 70లో లేకపోవడంతో.. బ్రిటిష్ ప్రభుత్వం అతని వర్క్ పర్మిట్ దరఖాస్తును ఆమోదించలేదు. ఇక 2010 మార్చి 24న కాన్సాస్ సిటీ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అలా ఆసియా వెలుపల ఆడిన మూడవ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. “ఆటకు వీడ్కోలు పలికాను. కానీ నాలో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. ఫుట్ బాల్ ఆడడాన్ని నిలిపివేద్దని అంటున్నాడు. జాతీయ జట్టు కోసం ఆడే అవకాశం లభిస్తే వదిలిపెట్టొద్దని వివరిస్తున్నాడు. నాకు చాలా కలలున్నాయి. వాటిని నిజం చేసుకోవడంలో నా వంతు ప్రయత్నం చేశానని” సునీల్ చెబుతున్నాడు. ” ఆటకు వీడ్కోలు చెప్పినప్పుడు చాలా ఉద్వేగానికి గురయ్యాను. అంతకుముందు ఈ విషయాన్ని నా భార్య, తల్లిదండ్రులతో చెప్పాను. నాన్న పర్వాలేదు గానీ, అమ్మ, భార్య ఏడ్చారు. నేను ఆడుతున్నప్పుడు వారు చాలా ఒత్తిడికి గురయ్యారు. దేశం తరఫున ఆడను అని తెలిసేసరికి వారే కాదు నేను కూడా బాధపడుతున్నానని” సునీల్ పేర్కొన్నాడు.

సునీల్ జాతీయ జట్టు కోసం తీవ్రంగా కష్టపడ్డాడు. ఫిఫా క్వాలిఫైయర్ లో భాగంగా కువైట్ తో జరిగే మ్యాచ్ ఇండియాకు చాలా అవసరం. తదుపరి రౌండ్ కు అర్హత సాధించాలంటే మూడు పాయింట్లు అత్యంత కీలకం. ఈ మ్యాచ్ భారత జట్టుకు ఎంత అవసరమో.. సునీల్ కు కూడా అలాగే అని అతని అభిమానులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular