England vs New Zealand : ఇటీవల అక్టోబర్ నెలలో న్యూజిలాండ్ శ్రీలంక పర్యటనకు వెళ్ళింది. రెండు టెస్టులలో ఓటమిపాలై 0-2 తేడాతో సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత నవంబర్ నెలలో భారత్ లో పర్యటించింది. అయితే మూడు టెస్టుల సిరీస్ ను 3-0 తేడాతో దక్కించుకుంది. సరికొత్త రికార్డు సృష్టిస్తూ స్వదేశంలో టీమ్ ఇండియాను వైట్ వాష్ చేసింది. భారత జట్టుకు ఘోరమైన ఓటమిని పరిచయం చేసిన న్యూజిలాండ్.. ఇప్పుడు స్వదేశంలో 0 చుట్టేందుకు రెడీ అవుతోంది. వరుసగా రెండు టెస్టులను ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి.. సిరి స్కూల్ పోయింది. మరోవైపు న్యూజిలాండ్ జట్టుపై అద్భుతమైన విజయాన్ని సాధించిన శ్రీలంక.. సౌత్ ఆఫ్రికా ఎదుట దారుణమైన ఓటమిని ఎదుర్కోవడానికి రెడీ అయింది. ఇది కూడా మరో వైట్ వాష్ ఫలితమే అవుతుందని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
323 రన్స్ తేడాతో..
ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ జట్ల మధ్య రెండవ టెస్ట్ ఆదివారం ముగిసింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 323 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ను ఓడించింది. ఇంగ్లాండ్ విధించిన 583 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన న్యూజిలాండ్ 259 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేసి 280 రన్స్ చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్ 125 రన్స్ కే చాప చుట్టింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 427/6 వద్ద డిక్లేర్ చేసింది. మొత్తంగా న్యూజిలాండ్ ఎదుట ఫై 583 రన్స్ టార్గెట్ విధించింది. బ్రూక్(123, 55) మైదానంలో విధ్వంసం సృష్టించాడు..రూట్(106) బ్యాటింగ్ పరాక్రమాన్ని ప్రదర్శించాడు. ఇక న్యూజిలాండ్ ఆటగాళ్లలో బ్లెండర్ 115 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే ఈ రెండు జట్ల మధ్య మూడవ టెస్ట్ డిసెంబర్ 14 నుంచి మొదలవుతుంది.
ఫస్ట్ ప్లేస్ లోకి ఆస్ట్రేలియా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కూడా నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. పెర్త్ లో టీమిండియా 295 రన్స్ తేడాతో గెలిస్తే.. ఆస్ట్రేలియా అడిలైడ్ లో పదవి గట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకుంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ పాయింట్ల పట్టిక ఆసక్తికరంగా మారింది. నిన్నటి వరకు మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చింది. భారత్ ఫస్ట్ ప్లేస్ నుంచి మూడో ప్లేస్ కి వెళ్ళిపోయింది. దక్షిణాఫ్రికా అనూహ్యంగా సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది. ఒకవేళ దక్షిణాఫ్రికా శ్రీలంకపై విజయం సాధిస్తే అదే స్థానంలో సుస్థిరంగా ఉంటుంది. అప్పుడు భారత్ తదుపరి మూడు టెస్ట్ మ్యాచ్ లను గెలుపొందాల్సి ఉంటుంది. అప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి భారత్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. న్యూజిలాండ్ దారుణమైన ఓటమిని ఎదుర్కొన్న నేపథ్యంలో.. సోషల్ మీడియాలో భారత అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు..”ఏం ఫీల్ ఉంది మావ.. మనల్ని 0-3 తో ఓడ గొట్టినోళ్లు కిందకు పడిపోయారు…ఈ అనుభూతిని వర్ణించలేం.. థాంక్స్ ఇంగ్లాండ్” అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.