https://oktelugu.com/

Zomato : జొమాటో మోసాన్ని బయటపెట్టిన ఇండియన్ క్రికెటర్

మనిషి ఆకలిని డబ్బులతో భర్తీ చేయలేమని"జొమాటో కు చురకలు అంటించాడు. దీపక్ ట్విట్ చేసిన నేపథ్యంలో చాలామంది తమ అనుభవాలను పంచుకున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : February 26, 2024 / 10:12 AM IST
    Follow us on

    Zomato : ఒకప్పుడు ఏదైనా సరదాగా స్నేహితులతో ఏదైనా తినాలనిపిస్తే బయటకు వెళ్లాల్సి వచ్చేది. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఒక్క క్లిక్ చేస్తే చాలు కోరుకున్న ఆహారం చెంతకే వస్తోంది.. ఇలాంటి సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది జొమాటో. దేశవ్యాప్తంగా విస్తృతమైన నెట్వర్క్ కలిగి ఉండి లక్షలాదిమందికి ఆహారాన్ని కోరుకున్న చోటుకు డెలివరీ చేస్తోంది ఈ సంస్థ. అయితే జొమాటో వ్యాపారం పేరుతో మోసం చేస్తోందా? వినియోగదారులంటే జొమాటో కు లెక్క లేదా? ఈ ప్రశ్నలకు ఔను అనే సమాధానం చెబుతున్నాడు టీమిండియా క్రికెటర్ దీపక్ చాహార్.

    ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న దీపక్.. జొమాటో సంస్థ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేశాడు. జొమాటో వినూత్న రీతిలో వినియోగదారులను మోసం చేస్తోందని ఆరోపించాడు.. తాను ఫుడ్ కోసం ఆర్డర్ చేశానని.. అది రాకపోయినప్పటికీ యాప్ లో డెలివరీ అయినట్టు చూపిస్తోందని.. కస్టమర్ కేర్ కు కాల్ చేసినప్పటికీ.. అక్కడి నుంచి కూడా అదే సమాధానం వచ్చిందని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా సేవ పేరుతో వినియోగదారులను జొమాటో మోసం చేస్తోందని అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాలాంటి అనుభవాలే ఇతరులకు ఎదురైతే చెప్పాలని అతడు సామాజిక మాధ్యమాల వేదికగా కోరాడు. తను ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్.. జొమాటో నుంచి వచ్చిన రిప్లై ని స్క్రీన్ షాట్ తీసి దీపక్ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు. “జొమాటో యాప్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాను. యాప్ లో డెలివరీ అయినట్టు చూపిస్తోంది. నాకు ఇంతవరకు ఎటువంటి ఫుడ్ ఇవ్వలేదు. కస్టమర్ సెంటర్ కి ఫోన్ చేస్తే వాళ్లు కూడా ఇదే సమాధానం చెప్పారు. నాలాగే ఇలాంటి సమస్యలు దేశంలో చాలామంది ఎదుర్కొంటున్నారు. నాలాగే మీరు ఇబ్బందులు పడితే మీ బాధను షేర్ చేసుకోండి జొమాటో ను ట్యాగ్ చేయడం మర్చిపోకండి అంటూ” దీపక్ ట్విట్టర్లో పేర్కొన్నాడు.

    దీపక్ చేసిన ట్వీట్ కు జొమాటో స్పందించింది..” దీపక్.. మీకు కలిగిన అసౌకర్యానికి మేము బాధపడుతున్నాం. ఇటువంటి విషయాలను మేము తీవ్రంగా పరిగణిస్తాం. ఈ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం” అని జొమాటో రిప్లై ఇచ్చింది. దీనిపై దీపక్ కూడా రిప్లై ఇచ్చాడు.”అందరూ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రముఖంగా ప్రస్తావించాలని రాసుకొచ్చాను. డబ్బులు తిరిగి ఇచ్చినందుకు మాత్రాన సమస్య పరిష్కారం కాదు కదా. మనిషి ఆకలిని డబ్బులతో భర్తీ చేయలేమని”జొమాటో కు చురకలు అంటించాడు. దీపక్ ట్విట్ చేసిన నేపథ్యంలో చాలామంది తమ అనుభవాలను పంచుకున్నారు.