https://oktelugu.com/

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ సహాయం చేసినవారే.. ఆయన్ని మోసం చేస్తున్నారా..?

ఇక వీళ్లంతా పవన్ కళ్యాణ్ ను వాడుకొని పైకి వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన గురించి మాట్లాడకపోవడం చాలా బాధాకరం...

Written By: , Updated On : February 26, 2024 / 10:05 AM IST
Pawan Kalyan
Follow us on

Pawan Kalyan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో మనందరికీ తెలుసు. ఆయన హీరోగా ఒక సినిమా వస్తుంది అంటే దాని ఇంపాక్ట్ ప్రేక్షకుల్లో విపరీతంగా ఉంటుంది. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా హిట్ అయిన, ఫ్లాప్ అయిన ప్రేక్షకులను మాత్రం ఎప్పుడూ నిరాశపరచదు. ఎందుకంటే ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ఉంటాడు కాబట్టి, కేవలం ఆయనను స్క్రీన్ మీద చూడడానికే చాలా మంది అభిమానులు ఆయన సినిమా కోసం ఎదురుచూస్తున్నారు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ సహాయంతో ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా, నటులుగా ఎదిగిన చాలా మంది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను పట్టించుకోకుండా ఉంటున్నారు. వాళ్ళు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన చాలా సినిమాల్లో అలీ నటించాడు. మొదటి నుంచి కూడా ఆయన సినిమాల్లో ఒక సపరేట్ క్యారెక్టర్ లో నటిస్తూ వచ్చాడు. ఎవరైనా డైరెక్టర్ పవన్ కళ్యాణ్ దగ్గరికి ఒక సినిమా స్క్రిప్ట్ తో వస్తే ఆ స్టోరీ పవన్ కళ్యాణ్ కి నచ్చి అది ఒకే అయితే, ఆ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ మనం చేసే ఈ సినిమాలో ఆలీ కోసం ఒక క్యారెక్టర్ రాయండి అని చెప్పేవారట. అలాంటి ఒక మంచి ఫ్రెండ్ అయినా పవన్ కళ్యాణ్ ని మోసం చేసి అలీ వైసీపీ పార్టీలో చేరాడు…అయితే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ కి రాక ముందు నుంచే అలీ సినిమాల్లో నటిస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో చేశాకే అలీ కి మంచి పేరు వచ్చింది. చాలా అవకాశాలు కూడా చాలా వచ్చాయి…

నితిన్
నితిన్ కి వరుసగా 14 ప్లాపులు వచ్చిన తర్వాత ఒక హిట్టు సినిమా రావడం కోసం పవన్ కళ్యాణ్ పేరుని వాడుకొని విపరీతంగా పబ్లిసిటీ చేసుకొని, ఇష్క్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ ను చీఫ్ గెస్ట్ గా పిలిపించి ఆయన చేత ఆడియో రిలీజ్ చేసి మరి నితిన్ ఆ సినిమాతో సక్సెస్ సాధించాడు. ఇక ఇప్పుడు మంచి సక్సెస్ లను అందుకొని స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్నాడు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కోసం ఒక్కరోజు కూడా ఆయన జెండా పట్టుకోలేదు. ఆయనకు ఓటేయమని ఇప్పటివరకు ఒక్కసారి కూడా తను చెప్పలేదు.

అల్లు అర్జున్
అల్లు అర్జున్ ఈ స్టేజ్ లో ఉన్నాడు అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్… అందుకే మొదట్లో అల్లు అర్జున్ చాలా సినిమా ఫంక్షన్స్ కి పవన్ కళ్యాణ్ వచ్చి సపోర్ట్ చేశాడు. అప్పట్లో అల్లు అర్జున్ స్టేజ్ ఎక్కిన ప్రతి సారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేవాడు. కానీ వరుసగా కొన్ని హిట్లు వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ గురించి నేను చెప్పను బ్రదర్ అని ఓపెన్ గా చెప్పేంత స్థాయి కి ఎదిగాడు…

ఇక వీళ్లంతా పవన్ కళ్యాణ్ ను వాడుకొని పైకి వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన గురించి మాట్లాడకపోవడం చాలా బాధాకరం…