India Vs Sri Lanka: ఇండియా శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించడం జరిగింది. దీంతో ఇండియా ఏషియా కప్ లో ఫైనల్ కి చేరుకుంది ఇక ఇండియాతో పాటు ఫైనల్ లో తలపడే టీం ఏది అనేది ఇంకా తెలియాల్సి ఉంది.పాకిస్తాన్ శ్రీలంక ల మధ్య ఒక మ్యాచ్ ఉంది ఆ మ్యాచ్ ఆడితే గానీ ఈ టీమ్ ఫైనల్ కి వస్తుందో తెలియదు.
ఎందుకంటే ఈ రెండు టీమ్ లు కూడా తలో మ్యాచ్ గెలిచి చెరో 2 పాయింట్ల ను దక్కించుకున్నాయి కాబట్టి ఈ రెండు టీం లు అడబోయే మ్యాచ్ లో ఏ టీం అయితే గెలుస్తుందో…ఆ టీమ్ ఇండియాతో పాటు ఫైనల్లో తలపదుతుంది. ఇక ఈ క్రమం లో శ్రీలంక వరుసగా 12 విజయాలను నమోదు చేసుకుంది.13 వ విజయం కోసం ట్రై చేసింది కానీ కుదరలేదు…అయితే శ్రీలంక ఏ టీముల మీద విజయాలను దక్కించుకుందో ఒకసారి మనం తెలుసుకొందాం…. శ్రీలంక వరుసగా ఆఫ్గనిస్తాన్ మీద రెండు మ్యాచ్ ల్లో గెలిచింది. ఇక ఐసీసీ నిర్వహించే వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో యూఏఈ మీద అలాగే ఒమన్ మీద కూడా ఒక మ్యాచ్ గెలిచింది. అలాగే మీద ఐర్లాండ్ మీద,నెదర్లాండ్ మీద, స్కాట్లాండ్ మీద, జింబాబ్వే మీద నాచురల్ గెలుచుకుంటూ వచ్చింది అలాగే క్వాలిఫైయర్ మ్యాచ్ లో అత్యంత ప్రమాదకరమైన వెస్టిండీస్ టీం మీద కూడా వరుస విజయాలను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఏషియా కప్ లో ఆడుతున్న శ్రీలంక టీం లీగ్ మ్యాచ్ ల్లో బంగ్లాదేశ్ మీద కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది, అలాగే ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా ఒక విజయాన్ని దక్కించుకుంది.
ఇక సూపర్ 4 లో భాగంగా బంగ్లాదేశ్ మీద కూడా మరో సొంతం చేసుకుంది. ఇలా వరుసగా 12 విజయాలను దక్కించుకున్న తర్వాత నిన్న ఇండియా మీద ఆడిన మ్యాచ్ లో 13వ విజయాన్ని కూడా దక్కించుకోవాలి అనుకుంది కానీ ఇండియన్ ప్లేయర్ల దాటికి శ్రీలంక కన్సిస్టెంట్ గా ఆడలేకపోయింది దాంతో 13వ విజయం దక్కలేదు.ఇక శ్రీలంక టీమ్ సాధించిన 12 విజయాలకు గండి కొడుతూ ఇండియా శ్రీలంక ని ఓడించడం జరిగింది. ఇది చూసిన క్రికెట్ మేధావులు సైతం ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ల మీద మ్యాచ్ గెలిచినంత ఈజీగా ఇండియా మీద మ్యాచ్ ఆడి వాళ్ళని ఓడించడం అంటే అని వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇండియాని ఓడించాలంటే ఇప్పుడున్న టీముల్లో చాలా టీము లకి కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు ఎలాగైతే ఇండియా టీం లో ప్లేయర్లు పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ లలో ఉండి చాలా స్ట్రాంగ్ గా ఉండేదో ఇప్పుడు కూడా కేఎల్ రాహుల్,శ్రేయాస్ అయ్యర్, జస్ప్రిత్ బుమ్రా లాంటి ప్లేయర్లు ఇండియాలోకి రావడంతో అంతే స్ట్రాంగ్ గా తయారయింది. ఇక ఫైనల్లో ఇండియా తో తలబడే టీం ఏదో తెలియాలంటే ఇంకో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే…