Kho kho World Cup 2025: గ్రామీణ క్రీడగా పేరుపొందిన ఖోఖో కు అంతర్జాతీయ స్థాయిలో (International level) పేరు తెచ్చేందుకు ఈసారి వరల్డ్ కప్ నిర్వహించారు. ఈ కప్ కు అంతంతమాత్రం ఆదరణ దక్కుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భారత్ ఈ టోర్నీని అద్భుతంగా నిర్వహించింది. అందువల్లే ప్రపంచ వ్యాప్తంగా చాలా వరకు దేశాలు ఈ పోటీలో పాల్గొన్నాయి. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లలో భారత పురుషులు, మహిళల జట్లు విజయాలు సాధించాయి.. మహిళల విభాగంలో, పురుషుల విభాగంలో భారత జట్లు విజయాలు సాధించడంతో దేశవ్యాప్తంగా అభినందనలు జల్లు కురుస్తోంది. క్రీడాభిమానులు, ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ఈ జాబితాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Indian prime minister Narendra Modi) కూడా చేరారు . పురుషులు, మహిళల జట్లను అభినందించారు.. ఈ విజయం ఈ దేశ ప్రజలకు స్ఫూర్తివంతంగా ఉంటుందని.. యువతలో పోరాట కాంక్షను కలిగిస్తోందని ట్విట్టర్ ఎక్స్ లో పేర్కొన్నారు. ” మీ ఆట తీరుతో నూరుకోట్ల ప్రజల ఆకాంక్షాలు ఫలించాయి. మీ పోరాటం స్ఫూర్తివంతంగా నిలుస్తుంది. మీ ఆట తీరు పోరాట పటిమకు సరికొత్త అర్ధాన్ని ఇస్తుంది. మీ విజయం కేవలం ట్రోఫీలను మాత్రమే అందించలేదు.. అంతకుమించిన ఆత్మవిశ్వాసాన్ని ఈ దేశ ప్రజలకు కల్పించింది. ఇలానే సాగి దేశాన్ని మరింత ముందంజలో నిలపాలని కోరుకుంటున్నానని” నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
ఫైనల్ లో రఫా రఫా
ఫైనల్ మ్యాచ్లో భారత మహిళల జట్టు నేపాల్ పై ఏకచత్రాధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రారంభంలో దూకుడు కొనసాగించి… మధ్యలో తడబడి.. చివర్లో పరాక్రమాన్ని ప్రదర్శించింది. అందువల్లే నేపాల్ జట్టును ఫైనల్ మ్యాచ్లో 78-40 తేడాతో మట్టికరి పెంచింది.. టీమిండియా కెప్టెన్ ప్రియాంక ఇంగ్లే(Priyanka ingley), వైష్ణవి అదిరిపోయే డిఫెన్స్ ఆడటంతో టీమిండియా ఒక్కసారిగా లీడ్ లోకి వెళ్లింది. మధ్యలో కాస్త తడబడినప్పటికీ చివర్లో మళ్ళీ పుంజుకుంది. మొత్తంగా సిరీస్ సొంతం చేసుకుంది..
పురుషుల విభాగంలోనూ..
పురుషుల విభాగంలోనూ భారత జట్టు నేపాల్ పై విజయం సాధించింది. ప్రారంభించి ఆ టాకింగ్ గేమ్ ఆడింది..54-36 తేడాతో నేపాల్ జట్టుపై విజయాన్ని దక్కించుకుంది.. ప్రారంభంలో భారత్ ఒక్కసారిగా 26-0 లీడ్లోకి వెళ్ళింది. ఆ తర్వాత నేపాల్ కాస్తలో కాస్త పోటీ ఇచ్చింది. అయినప్పటికీ టీమిండియా దూకుడు తగ్గించలేదు. చివరి వరకు అదే జోరు కొనసాగించింది. ఏ మాత్రం భయపడకుండా డిఫెన్స్ గేమ్ తో పాటు.. అటాకింగ్ గేమ్ ను ప్రదర్శించింది. చివరిసారిగా టైటిల్ అందుకుంది. అటు మహిళల జట్టు, ఇటు పురుషుల జట్టు నేపాల్ పై గెలిచి టైటిల్స్ సొంతం చేసుకోవడం విశేషం. నేపాల్ పురుషులు, మహిళల జట్లు మధ్యలో కాస్త ప్రతిఘటించినప్పటికీ చివరి వరకు ఆ జోరు కొనసాగించలేకపోవడంతో టైటిళ్లు కోల్పోవాల్సి వచ్చింది.