https://oktelugu.com/

WTC Final 2025: ఆస్ట్రేలియాతో 3-2 తేడాతో గెలిచినా భారత్ WTC ఫైనల్స్ వెళ్తుంది.. ఎలాగంటే?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతోంది. ఇందులో భాగంగా ఐదు టెస్టులు ఆడనుంది. ఇటీవల జరిగిన తొలి టెస్ట్ లో భారత్ గెలిచింది. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 295 రన్స్ తేడాతో విజయం సొంతం చేసుకుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 2, 2024 / 09:24 PM IST

    WTC Final 2025(2)

    Follow us on

    WTC Final 2025: స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ వైట్ వాష్ కు గురికావడంతో WTC ఫైనల్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇదే క్రమంలో ఆస్ట్రేలియాపై భారత్ ఐదు టెస్టుల సిరీస్ 4-0 తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఒకవేళ భారత్ 5-0 తేడాతో సిరీస్ గెలిస్తే ఎటువంటి సమీకరణంతో సంబంధం లేకుండా భారత నేరుగా ఫైనల్ వెళ్తుంది. అయితే ఇప్పుడు టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పై 3-2 తేడాతో సిరీస్ గెలిస్తే WTC ఫైనల్స్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆస్ట్రేలియాతో జరిగే రెండు టెస్టుల సిరీస్ ను శ్రీలంక కచ్చితంగా ఒక మ్యాచ్ డ్రా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే భారత్ WTC ఫైనల్స్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత జనవరి 29 నుంచి ఆస్ట్రేలియా శ్రీలంక వేదికగా టెస్ట్ సిరీస్ ఆడుతుంది.

    అప్పుడు కూడా ఉంటాయట

    బోర్డర్ గవాస్కర్ సిరీస్ భారత్ ఆస్ట్రేలియా మధ్య 2-2 డ్రా అయినప్పటికీ.. భారత్ WTC ఫైనల్స్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అలా జరగాలంటే ప్రస్తుతం దక్షిణాఫ్రికా శ్రీలంకలో జరిగే టెస్ట్ సిరీస్ ను 2-0 తేడాతో దక్కించుకోవాలి. ఇది మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా తో జరిగే రెండు మ్యాచ్లో టెస్ట్ సిరీస్ ను లంక ఆటగాళ్లు 1-0 తేడాతో సొంతం చేసుకోవాలి. ఈ సమీకరణాలు సాధ్యమైనప్పుడే టీం ఇండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-2 తో డ్రా చేసుకున్నప్పటికీ ఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది..5-0, ,4-1 4-0, 3-0 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ గెలిస్తే.. ఇతర జట్ల తో సంబంధం లేకుండా WTC ఫైనల్స్ లోకి వెళుతుంది. అప్పుడు ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ రేసు నుంచి వైదొలగుతుంది.. ఇవన్నీ కాకుండా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ గనుక 3-1 తేడాతో సొంతం చేసుకున్నా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళుతుంది. అయితే అప్పుడు సౌత్ ఆఫ్రికా తో జరిగే టెస్ట్ సిరీస్ లో శ్రీలంక ఒక మ్యాచ్ లో కచ్చితంగా విజయం సాధించాలి. అయితే ఈ మ్యాచ్ డ్రా అయితే.. ఆస్ట్రేలియాపై భారత్ 3-1 తేడాతో టెస్ట్ సిరీస్ గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి వెళుతుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 3-2 తేడాతో గెలిచినా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లే అర్హత సాధిస్తుంది. ఆస్ట్రేలియాతో జరిగే రెండు టెస్టుల సిరీస్ లో శ్రీలంక కచ్చితంగా ఒక మ్యాచ్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. టీమిండియా న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఓడిపోకుండా ఉండి ఉంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా దారుణంగా 0-3 తేడాతో ఓడిపోవడం.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో ఆడే అవకాశాలను సంక్లిష్టం చేశాయి.