Odi World Cup 2023: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకుంది.ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కి వచ్చిన ఇండియన్ ఓపెనర్ ప్లేయర్లు అయిన రోహిత్ శర్మ ,శుభ్ మన్ గిల్ ఇద్దరు కూడా ఇండియన్ టీం కి మొదట మంచి శుభారంభాన్ని అందించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ అయితే దూకుడుగా ఆడుతూ తనదైన రీతిలో అద్భుతమైన సిక్స్ లు కొడుతూ సౌతాఫ్రికన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.ఈ క్రమంలో 24 బంతుల్లో 40 పరుగులు చేసి రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు అప్పుడు ఇండియన్ టీమ్ స్కోర్ 62 పరుగులు గా ఉంది.ఇక రోహిత్ అవుట్ అయిన వెంటనే శుభ్ మన్ గిల్ కూడా 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.దాంతో క్రీజ్ లోకి లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరు కలిసి ఒక అద్భుతమైన లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతూ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్లను ముప్పితిప్పలు పెడుతూ వికెట్ కోల్పోకుండా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు.
ఈ క్రమంలోనే మొదట ఇద్దరు కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్ అయితే దూకుడుగా ఆడుతూ సౌతాఫ్రికన్ బౌలర్లని ధాటిగా ఎదుర్కొన్నాడు. ఇక ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ తన 49వ సెంచరీని పూర్తి చేసుకొని వన్డేల్లో సచిన్ చేసిన 49 సెంచరీలతో ఉన్న రికార్డును సమం చేశాడు… ఇక బర్త్ డే రోజు ఒక అద్భుతమైన సెంచరీ చేయడమే కాకుండా వన్డేల్లో సచిన్ రికార్డ్ తో సమం కావడం చూసిన కోహ్లీ అభిమానులతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా దీన్ని ఒక పెద్ద సెలబ్రేషన్ గా జరుపుకుంటున్నారు… నిజానికి విరాట్ కోహ్లీ గత రెండు మ్యాచ్ లోనే సెంచరీలు చేయాల్సింది కానీ దురదృష్టవశాత్తు అవుట్ అయిపోవడం జరిగింది.

ఇక తన బర్త్ డే రోజు వన్డే లో సచిన్ సెంచరీలతో సమం చేయాలని రాసిపెట్టి ఉంది కాబట్టే ఆరోజు ఆ సెంచరీ లు మిస్ అయ్యాయి అంటూ అభిమానులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక కోహ్లీ ఈ టోర్నీ లో ప్రతి మ్యాచ్ లో తనదైన రీతిలో ఆడుతూ వస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లో తమదైన రీతిలో టీమ్ స్కోర్ ని ముందుకు పరుగులు పెట్టిస్తున్నాడు.ఇక ఈ క్రమంలోనే ఈ టోర్నీ లో రెండు సెంచరీలు పూర్తి చేసిన ప్లేయర్ గా ఇండియన్ టీం తరఫున కోహ్లీ నిలిచాడు…ఇక శ్రేయాస్ అయ్యర్ కూడా తన అద్భుతమైన ఫామ్ తో గ్రౌండ్ నలుమూలాల షాట్స్ కొడుతూ 77 పరుగులు చేసి ఔట్ అయ్యాడు కానీ ఈ ఇన్నింగ్స్ తో ఇప్పటి వరకు తన మీద వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు…సూర్య కుమార్ యాదవ్ 14 బంతుల్లో 5 ఫోర్లు కొట్టి 22 పరుగులు చేసి షంశి బౌలింగ్ లో డికాక్ ఒక అద్భుతమైన క్యాచ్ పట్టుకోవడంతో సూర్య కుమార్ యాదవ్ ఔట్ అయ్యాడు…
ఇక ఈ మ్యాచ్ లో గెలిచి ఇండియా వరల్డ్ కప్ లో వరుసగా 8 విజయాలను దక్కించుకున్న టీమ్ గా అరుదైన రికార్డు కొట్టాలని ఇండియన్ టీం చూస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే బ్యాటింగ్ లో అద్భుతాలను చేస్తూ ముందుకు సాగుతుంది. ఇక ఈ క్రమంలో బౌలింగ్ లో కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ను కనబరిస్తే ఇండియా ఈ మ్యాచ్ లో గెలవడం పెద్ద కష్టమైతే కాదు…