India vs South Africa Test Ticket Prices: శీర్షిక చదివి మీకు ఏమైనా మతి పోయిందా అనుకుంటున్నారు కదా.. మీకు ఆ అనుమానం రావడంలో సందేహం లేదు. కాకపోతే పూర్తి కథనం చదివితే మేము ఎందుకు ఆ శీర్షికపెట్టామో.. ఎందుకు ఆ స్థాయిలో ప్రస్తావించాల్సి వచ్చిందో.. అవగతం అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం.. చదివేయండి ఈ కథనం.
మన దేశంలో క్రికెట్ అనేది ఒక ఎమోషన్. మన జట్టు ఎలాంటి ప్రత్యర్థి పై ఆడినా మైదానానికి తండోపతండాలుగా ప్రేక్షకులు వస్తుంటారు. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఏ వేదిక మీద ఆడినా సరే మన ఆటగాళ్ల ఆట తీరు చూసేందుకు ప్రేక్షకులు పోటీలు పడుతుంటారు. క్రికెట్ అంటే మన నరనరాల్లో జీర్ణించకపోయిన ఒక ఎమోషన్. పైగా క్రికెట్ అంటే మనదేశంలో చాలామంది విపరీతంగా ఇష్టపడుతుంటారు. అయితే అటువంటి మనదేశంలో నేడు క్రికెట్ కు గడ్డు రోజులు వచ్చాయా? క్రికెట్ చూసేందుకు ప్రేక్షకులు మైదానానికి రావడానికి ఇష్టపడటం లేదా? చివరికి ప్రేక్షకుల మనసు గెలుచుకోవడానికి బీసీసీఐ టికెట్ ధరలు తగ్గించిందా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి.
టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడుతోంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఓటమిపాలైంది. రెండవ వన్డే బుధవారం జరగనుంది. ఈ సిరీస్ పూర్తయిన తర్వాత టీమిండియా స్వదేశంలో సౌత్ ఆఫ్రికా జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి టికెట్లను అందుబాటులో ఉంచింది. అయితే టికెట్ విక్రయాలను మొదలు కూడా పెట్టింది. నవంబర్ 14 నుంచి 18 వరకు సౌత్ ఆఫ్రికా తో భారత్ తొలి టెస్ట్ కోల్ లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడబోతోంది. అయితే టికెట్ విక్రయాలను చేపట్టిన బీసీసీఐ.. కనీస ధరగా రోజుకు 60 రూపాయలను నిర్ణయించింది. దీని వెనుక కారణం లేకపోలేదు..
ఇటీవల టీమిండియా వెస్టిండీస్ జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడింది. అహ్మదాబాద్, ఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్లు జరిగాయి. ఈ మ్యాచ్లు చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా హాజరు కాలేదు. దీంతో సౌత్ ఆఫ్రికా టెస్ట్ కబ్కూడా ఇదే అనుభవం ఎదురవుతుందని భావించిన మేనేజ్మెంట్ టికెట్ ధరలను అమాంతం తగ్గించింది. టి20 ల ప్రభావం.. ఐపీఎల్ జోరు.. ఇవన్నీ కూడా ప్రేక్షకుల మనసును మార్చాయని విశ్లేషకులు అంటున్నారు. పైగా టెస్ట్ సిరీస్లో రోజంతా ఆట ఉంటుంది. ప్రేక్షకులు కోరుకునే విధంగా అందులో మెరుపులు ఉండవు. నిదానంగా ఆట సాగుతూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా ప్రేక్షకులకు బోరింగ్ వ్యవహారం లాగా అనిపిస్తున్న నేపథ్యంలోనే టెస్ట్ మ్యాచ్ చూసేందుకు అంతగా మైదానాలకు రావడంలేదని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ప్రేక్షకులు మునుపటి మాదిరిగా టెస్ట్ మ్యాచ్లు చూసేందుకు మైదానాల్లోకి రావాలి అంటే ఏదో ఒక అద్భుతం జరగాలి. టికెట్ ధర తగ్గించి ఆ అద్భుతాన్ని బీసీసీఐ అందుబాటులోకి తెచ్చింది. మరి ఇది ప్రేక్షకుల మనసును ఆకట్టుకుంటుందా? ప్రేక్షకుల మనసు మార్చుతుందా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.