https://oktelugu.com/

India vs South Africa : 87 పరుగులకే ఆరు వికెట్లు.. అదిగో అప్పుడొచ్చాడు హార్దిక్.. జట్టు స్వరూపాన్నే మార్చేశాడు..

తొలి టి20 మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీమిండియా పై 61 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లపై విమర్శలు వ్యక్తం అవడం ప్రారంభమైంది. దీంతో రెండవ టి20 మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Written By: NARESH, Updated On : November 10, 2024 9:34 pm

hardhik pandya

Follow us on

India vs South Africa  : గెబెహా వేదికగా సెయింట్ జార్జ్ మైదానంలో ఆదివారం రాత్రి 8:30 నుంచి టీమిండియా, సౌత్ ఆఫ్రికా జట్లు రెండవ టి20 మ్యాచ్లో తలపడుతున్నాయి. తొలి మ్యాచ్ మాదిరిగానే రెండో మ్యాచ్ లోనూ సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ మార్క్రం నిర్ణయం సరైనదని స్పష్టం చేస్తూ దక్షిణాఫ్రికా బౌలర్లు సత్తా చాటారు. తొలి మ్యాచ్లో సెంచరీ చేసిన సంజు శాంసన్ ను మార్కో జాన్సన్ డకౌట్ చేశాడు. ఇది టీమిండియాకు కోలుకోలేని షాక్ లాగా మారింది. ఆ తర్వాత అభిషేక్ శర్మ కోయేర్ట్ జీ బౌలింగ్లో నాలుగు పరుగులు మాత్రమే చేసి మరోసారి నిరాశపరిచాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా నాలుగు పరుగులు మాత్రమే సైమ్ లాన్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికే భారత్ కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో తిలక్ వర్మ 20, అక్షర్ పటేల్ (21) దూకుడుగా ఆడారు. వీరిద్దరూ కాస్త నిలబడటంతో టీమిండియా నాలుగో వికెట్ 30 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయగలిగింది. అంతకుముందు టీమిండియా 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి దారుణమైన కష్టాల్లో పడింది. ఈ దశలో ధాటిగా ఆడబోయి తిలక్ వర్మ, అక్షర్ పటేల్ స్వల్ప పరుగుల తేడాతో అవుట్ కావడంతో.. టీమిండియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ దశలో వచ్చిన హార్దిక్ పాండ్యా ఆపద్బాంధవుడి పాత్రను భుజాలకు ఎత్తుకున్నాడు..

దీటుగా ఎదుర్కొంటూ.. అప్పటికే ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియాను గాడిన పడేస్తూ అతడు బ్యాటింగ్ చేశాడు. 45 బంతులు ఎదుర్కొన్న అతడు 39 పరుగులు చేసి.. సత్తా చాటాడు. అతడు గనుక నిలబడకపోయి ఉంటే టీమిండియా 100 పరుగుల లోపే కుప్పకూలేదు. ఓ ఎండ్ లో అర్ష్ దీప్ సింగ్ ఉన్నప్పటికీ.. అతడికి స్ట్రైకింగ్ ఇవ్వకుండా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేశాడు. ఫలితంగా టీమ్ ఇండియా స్కోర్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఒకానొక దశలో 87 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో టీమిండియా కూరుకుపోయింది. ఈ దశలో హార్దిక్ పాండ్యా జట్టు భారాన్ని మోసాడు. భారీ షాట్లు ఆడకపోయినప్పటికీ.. సమయోచితమైన ఆట తీరు ప్రదర్శిస్తూ జట్టు స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. వాస్తవానికి 100 పరుగుల లోపే చాప చుడుతుందనుకుంటున్న తరుణంలో.. హార్దిక్ పాండ్యా జట్టును గాడిలో పెట్టాడు. అందువల్లే టీమిండియా స్కోర్ 124 పరుగులకు చేరుకుంది. హార్దిక్ లేకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.

దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ మహారాజ్ మినహా మిగతా వారంతా వికెట్ దక్కించుకున్నారు. తొలి టి20 లో ధారాళంగా పరుగులు ఇచ్చిన సౌతాఫ్రికా బౌలర్లు.. రెండో టి20 మ్యాచ్లో మాత్రం సత్తా చాటారు. పెద్దగా పరుగులు ఇవ్వకుండానే.. వికెట్లను సొంతం చేసుకున్నారు. టీమిండియా బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. లేకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. అయితే మైదానం అటు పేస్, ఇటు స్పిన్ బౌలర్లకు అనుకూలిస్తోంది. దీంతో బ్యాటర్లకు పరుగులు చేయడం కష్టంగా మారుతుంది. మైదానం మీద తేమ ఉన్న నేపథ్యంలో చేజింగ్ చేసే జట్టుకు మరింత కష్టం ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ మైదానంపై హైయెస్ట్ స్కోర్ 135 పరుగులు కావడం విశేషం. టీమిండియా ఆ స్థాయి స్కోర్ సాధించలేకపోయినప్పటికీ.. కాస్త లో కాస్త గౌరవప్రదమైన పరుగులు చేయగలిగింది.